Metro Rail | హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలు నిర్వహించేలా ఇటీవల అధికారులు ట్రయల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామన్న అధికారులు.. తాజాగా శుక్రవారాల్లో రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.