YS Jagan | పిఠాపురంలో వంగా గీతను మంచి మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా చేస్తానని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ప్రకటించారు. ఒకవేళ దత్తపుత్రుడు గెలిస్తే ఇక్కడే ఉంటాడా, హైదరాబాద్ వెళ్తాడా అని ప్రశ్నించారు. అందుకే దత్తపుత్రుడికి ఓటు వేయవద్దని, తనకు తల్లి సమానురాలైన సోదరి వంగా గీతను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారం భాగంగా పిఠాపురంలో వంగా గీతకు మద్ధతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాజువాక, భీమవరం అయిపోయింది ఇప్పడు పిఠాపురం అంటున్నాడని విమర్శించారు. దత్తపుత్రుడిని మహిళలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఐదేండ్ల కోసారి కార్లు మార్చినట్లు భార్యలను మారుస్తున్నదని ఎద్దేవా చేశారు.
సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని, పొరపాటున బాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని జగన్ అన్నారు. బాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమేనని చెప్పారు. కూటమికి ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపేనన్నారు. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో వైసీపీ ప్రభుత్వం జమ చేసిందని గుర్తుచేశారు.
రాబోయే ఐదేండ్లలో ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివన్నారు. ఐదేండ్లు లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించామని, ఇంటి వద్దకే పింఛన్, పౌరసేవలు, పథకాలు ఇస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను కూటమి నేతలు చెత్తబుట్టలో వేశారన్నారు. ఇంటింటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైసీపీని గెలిపించాలని కోరారు.
నా అక్క వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంగా చేసి.. మీ పిఠాపురంకే పంపిస్తా – సీఎం జగన్ pic.twitter.com/xU0XBZMGDX
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2024