Astrology | ఈ భూమ్మీద ప్రతి రోజు కొన్ని లక్షల మంది జన్మిస్తూనే ఉంటారు. తమ బిడ్డ శుభ సమయంలోనే జన్మించారా..? వారి నక్షత్రం ఏంటి..? రాశి ఏంటి..? అనే విషయాలను తెలుసుకునేందుకు తల్లిదండ్రులు జ్యోతిష్య పండితులను సంప్రదిస్తుంటారు. పండితులు పుట్టిన సమయం, గ్రహాల స్థితిని గమనిస్తారు. జన్మ నక్షత్రాన్ని బట్టి, ఆ నక్షత్రంలో ఉండే నాలుగు పాదాల ఆధారంగా వారి జాతకాన్ని నిర్ణయిస్తారు. జన్మించిన మాసం, రాశి, నక్షత్రం ఆధారంగా కూడా వారి కామన్ క్వాలిటీస్‌ను పండితులు అంచనా వేస్తుంటారు. అయితే తెలుగు నెలల ప్రకారం ఏ మాసంలో జన్మించిన వారికి ఏ క్వాలిటీస్ ఉంటాయో తెలుసుకుందాం..
చైత్ర మాసం
ఈ నెలలో జన్మించిన వారు బలంగా ఉంటారు, ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. కొత్తగా ప్రారంభించిన ఏ పని అయినా పూర్తయ్యేవరకూ పట్టువదలరు.
వైశాఖ మాసం
ఈ మాసంలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వం కలిగిఉంటారు. అందరకీ ఆదర్శవంతులుగా ఎదుగుతారు. మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు
జ్యేష్ఠమాసం
జ్యేష్ఠమాసంలో జన్మించినవారు చాలా తెలివిగలవారు,ముందుచూపు కలిగిఉంటారు.
ఆషాఢ మాసం
ఈ నెలలో పుట్టినవారు కష్టజీవులు. ఎంత పెద్ద కష్టాన్ని అయినా ఎదుర్కొనేందుకు, దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంటారు. కష్టాలకు బెదిరేరకం కాదు.
శ్రావణ మాసం
ఈ నెలలో జన్మించిన వారు ప్రముఖ వ్యక్తులుగా ప్రశంసలు అందుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలు సాధిస్తారు. సంప్రదాయాలకు విలువనిస్తూ జీవితం సాగిస్తారు
భాద్రపద మాసం
ఈ నెలలో పుట్టినవారు అందంగా ఉంటారు. అందరిలో కలివిడిగా ఉంటారు.
ఆశ్వయుజ మాసం
ఈ నెలలో జన్మించిన వారు దయగలవారై ఉంటారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు
కార్తీక మాసం
ఈ నెలలో పుట్టినవారు మహా మాటకారులు. ఎదుటివారిని ఆకట్టుకోవడంతో వీళ్లకు వీళ్లే సాటి
మార్గశిర మాసం
ఈ నెలలో పుట్టినవారు పరిశోధనలపై ఆసక్తి చూపిస్తారు. ఎక్కువ ప్రాంతాలను సందర్శిస్తారు
పుష్య మాసం
పుష్యమాసంలో జన్మించిన వారు రహస్యాలు దాచడంలో ఘనులు. ఏ విషయం అయినా వీళ్లకి హాయిగా చెప్పేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వ్యక్తికి చేరవేయరు.
మాఘ మాసం
ఈ నెలలో పుట్టినవారికి చదువంటే పిచ్చి. పుస్తకాల పురుగులుగా ఉంటారు. మంచి ఆలోచనా విధానం కలిగిఉంటారు.
ఫాల్గుణ మాసం
తెలుగు నెలల్లో చివరి నెల అయిన ఫాల్గుణమాసంలో పుట్టినవారు కుటుంబాన్ని ప్రేమిస్తారు. కుటుంబం తర్వాతే ఏదైనా అని అనుకుంటారు. వీరు చాలా అదృష్టవంతులు.