Weight Lost | చాలా మంది బరువు తగ్గేందుకు రకరకాల వర్కవుట్స్ చేస్తుంటారు. ప్రతి రోజు తప్పకుండా వాకింగ్ చేస్తుంటారు. జిమ్‌కు వెళ్తుంటారు. ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా చేసుకుంటారు. ఆయిల్ ఫుడ్‌కు చాలా దూరంగా ఉంటారు. ఇవన్నీ పాటిస్తున్న వారు రాత్రి 7 గంటల్లోపు మాత్రం డిన్నర్ కంప్లీట్ చేయాలని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. రాత్రి ఏడు లోపు డిన్నర్ పూర్తి చేయకపోతే.. ఎన్ని వర్కవుట్స్ చేసినా లాభం లేదని హెచ్చరిస్తున్నారు.
రాత్రి 7 గంటల లోపు డిన్నర్ పూర్తి చేయడం వల్ల జీవనశైలి, ఆహార ప్రాధాన్యతలు, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. తద్వారా బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే భోజనం, స్నాక్స్‌లో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారనేది కూడా బరువుపై ప్రభావం చూపిస్తుందని ఫిట్‌నెస్ నిపుణులు పేర్కొంటున్నారు.
రాత్రి 7 లోపు భోజనం పూర్తి చేయడంతో.. నిద్రకు కూడా ఎలాంటి భంగం కలగదు. లేట్ నైట్ డిన్నర్ చేస్తే.. రాత్రంతా అసౌకర్యం, అజీర్ణం వంటి సమస్యలు కూడా సంభవిస్తాయి. ఇది నిద్రకు భంగం కలిగించడమే కాకుండా.. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి 7 లోపు భోజనం చేస్తే నిద్ర నాణ్యత పెరగడంతో పాటు బరువు కూడా తగ్గేందుకు ఛాన్స్ ఉంటుంది.
రాత్రి ఏడు గంటల్లోపు భోజనం చేసే వారిలో షుగర్ కంట్రోల్ అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది. శరీర కణాలు ఇన్సులిన్‌కు మరింత ప్రతిస్పందిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను మరింత ప్రభావవంతంగా నియంత్రిస్తాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రాత్రుళ్లు లేట్‌గా డిన్నర్ చేయడం, అధిక కేలరీలు, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఏడులోపు భోజనం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫ్యాట్, ఫ్రై చేసిన ఫుడ్స్ తీసుకోకపోతే గుండె ఆరోగ్యానికి మరీ మంచిది.
అయితే పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు డిన్నర్ ముగించాలని నిపుణులు చెప్తున్నారు. ఇవి మెరుగైన జీర్ణక్రియలో సహాయం చేస్తాయంటున్నారు. డిన్నర్ చేసిన తర్వాత ఓ 20 నిమిషాలు వాకింగ్ చేయడం మంచిదని చెప్తున్నారు. నిద్రవేళకు ముందు తినడం వల్ల అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం వంటివి కలుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే.. అది మరిన్ని అనారోగ్య సమస్యలు ఇస్తుంది. కాబట్టి ఏడుగంటల ముందు ఫుడ్ తీసుకున్నా.. హెల్తీ ఫుడ్ తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు.