Sunday, December 29, 2024
HomeSpiritualRudraksha | రుద్రాక్ష ధ‌రించి.. అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా..? శాస్త్రం ఏం చెబుతోంది..!

Rudraksha | రుద్రాక్ష ధ‌రించి.. అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా..? శాస్త్రం ఏం చెబుతోంది..!

Rudraksha | హిందూ సంప్ర‌దాయంలో రుద్రాక్ష‌ను ఎంతో ప్ర‌విత‌మైందిగా భావిస్తారు. రుద్రాక్ష సాక్ష్యాత్తు ఆ ప‌ర‌మ శివుడి క‌న్నీళ్ల నుంచి ఏర్ప‌డింద‌ని పురాణాలు చెబుతున్నాయి. మ‌హా శివుడి కంటి నుంచి రాలిన అశ్రు బిందువు రుద్రాక్ష‌గా మారింద‌ని చెబుతుంటారు. అయితే ఇంత ప‌విత్ర‌మైన రుద్రాక్ష ఎంతో శ‌క్తివంత‌మైంద‌ని భావిస్తారు. రుద్రాక్షను ధరించేవారికి, రుద్రాక్షను ఆరాధించేవారికి చాలా రకాల ఆధ్యాత్మిక లాభాలను పొందగలరు. కొందరు సంపదను, మన:శాంతిని, ఆరోగ్యాన్ని పొందుతారు. అయితే రుద్రాక్ష‌ను ధ‌రించే వారు త‌ప్ప‌నిస‌రిగా ఈ నియ‌మాలు పాటించాల‌ని పండితులు సూచిస్తున్నారు.

నియ‌మాలు ఇవే..

  • సోమవారం రోజున రుద్రాక్షధరిస్తే చాలా మంచిది. సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన రోజు కనుక విశేష ఫలితం ఉంటుంది. రుద్రాక్ష ఎల్లప్పుడు ధరించవచ్చు. ప్రతిరోజూ ఆరాధించవచ్చు.
  • ఉదయం రుద్రాక్ష ధరించే సమయంలో తప్పకుండా రుద్రాక్ష మంత్రం తొమ్మిది సార్లు పఠించాలి. రాత్రి తీసిన తర్వాత దాన్ని పవిత్రంగా భద్రపరచాలి.
  • రుద్రాక్షను పూజలో ఉంచేవారు నేతి దీపం, అగరు పొగను రుద్రాక్షకు సమర్పించాలి.
  • రుద్రాక్షను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రమైన నీళ్లతో లేదా పాలతో శుభ్రం చేస్తే వాటి వైశిష్ట్యం నిలిచి ఉంటుంది.
  • రుద్రాక్ష మాలలో 108 లేదా 54 పూసలు ఉంటాయి. 27 పూసలతో కూడా చిన్న జపమాలలు కూడా ఉంటాయి. ధరించే రుద్రాక్షను జపమాలగా ఉపయోగించకూడదు.
  • స్నానం చేసే సమయంలో రుద్రాక్ష తీసి పక్కన పెట్టాలి. సబ్బు వినియోగించడం వల్ల రుద్రాక్షలు పాడైపోతాయి.
  • ఒకరు ధరించిన రుద్రాక్ష మరొకరు ధరించకూడదు. మన రుద్రాక్ష ఎవరికీ ఇవ్వకూడదు.
  • రుద్రాక్షను ఎరుపు లేదా పసుపు దారంతో ధరించడం మంచిది.
  • రుద్రాక్ష ధరించి అంత్యక్రియలు, శవ ఊరేగింపు, దహనసంస్కారాల వంటి కార్యక్రమాల్లో పాల్గొన వద్దని శాస్త్రం చెబుతోంది. ఇలాంటి సందర్భాల్లో రుద్రాక్ష తీసి పక్కన పెట్టాలి.
RELATED ARTICLES

తాజా వార్తలు