Sunday, December 29, 2024
HomeTelanganaTelangana | ఉక్కపోతకు ఉపశమనం.. రేపు పలు జిల్లాల్లో వర్షాలు

Telangana | ఉక్కపోతకు ఉపశమనం.. రేపు పలు జిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్: భానుడి భగభగలు, వ‌డ‌గాల్పులు, ఉక్కబోతలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. గ‌త వారం రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతుండ‌టంతో ఉక్కిరిబిక్కిర‌వుతున్న‌ ప్ర‌జ‌లు.. ఆదివారం సాయంత్రం వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డ‌టంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆకాశం మేఘావృత‌మ‌వ‌డంతో సూర్యుడిని మ‌బ్బులు క‌మ్మేశాయి. దీంతో చ‌ల్ల‌నిగాలులు వీస్తున్నాయి. ప‌లుచోట్ల చిరుజ‌ల్లులు ప‌డ్డాయి. కాగా, సోమ‌వారం నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

హైదరాబాద్‌లో(Hyderabad Rains) రానున్న 48 గంటలపాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హన్మకొండలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, మేడ్చల్, మెదక్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

RELATED ARTICLES

తాజా వార్తలు