Friday, April 4, 2025
HomeSportsIndia| ఆ ఐదుగురు ఆట‌గాళ్లు లేకుండానే అమెరికా ఫ్లైటెక్కిన టీమిండియా..!

India| ఆ ఐదుగురు ఆట‌గాళ్లు లేకుండానే అమెరికా ఫ్లైటెక్కిన టీమిండియా..!

India| రెండు నెల‌ల నుండి ఐపీఎల్‌తో బిజీగా ఉన్న భార‌త ఆట‌గాళ్లు ఇప్పుడు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మరానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. జూన్ 2 నుండి జ‌ర‌గ‌నున్న ఈ మ‌హా సంగ్రామానికి అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌స్ట్‌లో మిస్ చేసుకున్న టీమిండియా ఈ ట్రోఫీని అందుకోవాల‌ని చాలా క‌సిగా ఉంది. అందుకే అక్క‌డి పరిస్థితుల‌కి అలవాటు ప‌డాల‌ని శ‌నివారం అమెరికా ఫ్లైట్ ఎక్కారు. సాధార‌ణంగా ఏ టూర్‌కి వెళ్లిన అంద‌రు ఆట‌గాళ్లు క‌లిసి వెళ‌తారు. కాన ఈ సారి ఎంపికైన ప్లేయర్లు అందరూ ఒకేసారి యూఎస్‌ఏకు వెళ్లట్లేదు.

రెండు బ్యాచ్‌లుగా వెళ్ల‌గా, తొలి బ్యాచ్‌‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ తదితరులు ఉన్నారు. అయిదుగురు ఆటగాళ్లు మినహా మిగిలిన అందరూ కలిసి ముంబై విమానశ్రయం నుండి అగ్ర‌రాజ్యానికి వెళ్లారు. రెండో బ్యాచ్‌లో ప్ర‌స్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న ఆట‌గాళ్లు ఉన్నారు. యశస్వీ జైస్వాల్, యుజువేంద్ర చాహల్, సంజు శాంసన్, అవేవ్ ఖాన్, రింకూ సింగ్ఈ రోజు ఐపీఎల్ ఫైన‌ల్ ఆడి అది పూర్తైన త‌ర్వాత అమెరికా ఫ్లైట్ ఎక్క‌నున్నారు. అయితే హార్ధిక్ పాండ్యా మాత్రం సింగిల్‌గా వెళుతున్న‌ట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం లండన్‌లో ఉన్న హార్దిక్ అక్కడ నుంచి నేరుగా యూఎస్‌ఏకు వెళ‌తారు. కోచింగ్ స్టాఫ్ మొదటి బ్యాచ్‌తోనే వెళ్లిన‌ట్టు తెలుస్తుంది.. భార‌త్ .. జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇండియా జ‌ట్టు గ్రూప్-ఏలో ఉండ‌గా, పాకిస్థాన్‌, ఐర్లాండ్, కెనడా, యూఎస్‌‌ఏతో త‌ల‌ప‌డాల్సి ఉంటుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. భారత్ సెమీస్‌కు చేరుకుంటే జూన్ 27న గయానా వేదికగా మ్యాచ్ నిర్వహిస్తారు. బార్బడోస్ వేదికగా జూన్ 29న ఫైనల్ జరగనుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‍మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్

RELATED ARTICLES

తాజా వార్తలు