India| టీ20 వరల్డ్ కప్ మొదలైనప్పుడు భారత్ ప్రపంచ కప్ దక్కించుకుంది. ఆ తర్వాత మళ్లీ టోర్నీ గెలిచింది లేదు. ఈ సారైన రోహిత్ నాయకత్వంలో వరల్డ్ కప్ అందుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. వన్డే వరల్డ్‌కప్ చేతి దాకా వచ్చిపోయింది. ఇక రోహిత్, విరాట్ ఈ వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సారి టీ20 వరల్డ్ కప్ భారత్‌కి రావాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కాని టీమిండియాకి విలన్‌లా మారిన అంపైర్ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2024లోను ఉండడంతో టెన్షన్ మొదలైంది. అతను ఉంటే భారత్ గెలవడం కష్టమేనంటూ కొందరు జోస్యాలు చెబుతున్నారు.
ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుండగా, ఈ టోర్నీ వెస్టిండీస్, అమెరికాలలో జరగనుంది. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి. ఇప్పటికే ప్రధాన జట్లన్ని కూడా తమ టీమ్స్‌ని ప్రకటించాయి. మరోవైపు టీ20 ప్రపంచ కప్ 2024 కోసం అంపైర్లు, మ్యాచ్ రిఫరీలను కూడా ఐసీసీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొత్తం 20 మంది అంపైర్లు, 6 మంది మ్యాచ్ రిఫరీల పేర్లను ఐసీసీ తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇందులో భారత్ నుండి నితిన్ మీనన్, జయరామన్ మదన్ గోపాల్ అంపైరింగ్ చేయనుండగా,మ్యాచ్ అఫీషియల్‌గా జవగల్ శ్రీనాథ్‌ని ఎంపిక చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కాని ఐసీసీ ప్రకటించిన అంపైర్ల జాబితాలో టీమ్ ఇండియాకు విలన్ లా మారిన రిచర్డ్ కెటిల్‌బరో పేరు ఉండడం ఇప్పుడు పెద్ద టెన్షన్‌గా మారింది.
రిచర్డ్ కెటిల్‌బరో ఐసీసీ టోర్నమెంట్‌లోని వివిధ 6 నాకౌట్ టోర్నమెంట్‌లలో టీమిండియా ఆడిన మ్యాచ్‌లకి అంపైరింగ్ చేశాడు. ఆ ఆరు మ్యాచ్‌లలోను టీమిండియా ఓడింది. ఇప్పుడు కెటిల్‌బరో టీ20 ప్రపంచకప్‌లో కూడా అంపైర్‌గా ఉంటే టీమిండియా ఓడిపోతుందని కొందరు జోస్యం చెబుతున్నరు. మరి కొందరు మాత్రం టీ20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్‌లో మనోళ్లు పాత సెంటిమెంట్‌ని తిరగరాస్తారని అంటున్నారు. చూడాలి మరి చివరికి ఏం చేస్తారనేది. ఇక ప్రపంచకప్ అంపైర్లు జాబితా చూస్తే.. అందులో క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గాఫ్నీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లావుద్దీన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదన్ గోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్‌స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రీఫెల్, పాల్ రీఫెల్ , లైంగ్ రోడ్స్, లాంగ్టన్ రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకోబ్ ఉన్నారు.