Saturday, April 5, 2025
HomeSports𝗧𝟮𝟬 𝗪𝗼𝗿𝗹𝗱𝗖𝘂𝗽 𝟮𝟬𝟮𝟰 ఛాంపియ‌న్స్ గా టీం ఇండియా

𝗧𝟮𝟬 𝗪𝗼𝗿𝗹𝗱𝗖𝘂𝗽 𝟮𝟬𝟮𝟰 ఛాంపియ‌న్స్ గా టీం ఇండియా

𝗧𝟮𝟬 𝗪𝗼𝗿𝗹𝗱𝗖𝘂𝗽 𝟮𝟬𝟮𝟰 ఛాంపియ‌న్స్ గా టీం ఇండియా

– 2వ సారి టి20 వ‌రల్డ్ క‌ప్ టైటిల్ ను గెలుచుకున్న టీం ఇండియా
– 17 సంత్స‌రాల విరామం త‌ర్వాత పోరాడి గెలిచిన భార‌త్
– విరాట్ కోహ్లీ కీల‌క‌మైన 76(59) పరుగులు
– ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ గా విరాట్ కోహ్లీ
– ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ గా జ‌స్ప్రీత్ బుమ్రా
– బ్రిడ్జ్ టౌన్, బార్బాడోస్ లో జ‌రిగిన ఇండియా-సౌత్ ఆఫ్రికా ఫైన‌ల్ మ్యాచ్

ఇండియా ఉత్కంఠభ‌రిత మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై 7 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టీమ్, విరాట్ కోహ్లీ 76(59) దూకుడు బ్యాటింగ్ తో 7 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 176 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ను భార‌త బౌల‌ర్ లు 169/8 ప‌రుగుల‌కే నిలువ‌రించ‌గ‌లిగారు. దీంతో టీం ఇండియా టి20 వ‌రల్డ్ క‌ప్ టైటిల్ ను రెండ‌వసారి చాలా సంవ‌త్స‌రాల విరామం త‌ర్వాత సాధించి క్రికెట్ అభిమానుల హృద‌యాల‌ను గెలుచుకుంది. ఇండియా మొద‌టిసారి 2007 లో టి20 వ‌రల్డ్ క‌ప్ టైటిల్ ను గెలుచుకుంది.

15 ఓవ‌ర్ ల త‌ర్వాత‌ సౌత్ ఆఫ్రికా 30 బంతుల‌లో 30 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా బుమ్రా త‌న అద్భుత‌మైన బౌలింగ్ తో ప‌రుగులు రాకుండా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆఖ‌రి ఓవ‌ర్ ను హార్థిక్ పాండ్య కు అప్ప‌గించ‌గా, మొద‌టి బంతికే సిక్స్ కొట్ట‌బోయిన మిల్ల‌ర్ బౌండ‌రీ వ‌ద్ద సూర్య కుమార్ యాద‌వ్ క్యాచ్ ప‌ట్ట‌డంతో అవుట‌య్యాడు. దీంతో టీమ్ ఇండియా విజ‌యం దాదాపు ఖ‌రార‌యింది.

హార్దిక్ పాండ్య 3(20) వికెట్లు, బుమ్రా 2(18) వికెట్లు, అర్ష‌దీప్ సింగ్ 2(20) వికెట్లు, అక్స‌ర్ ప‌టేల్ 1(49) వికెట్లు తీసుకున్నారు. విరాట్ కోహ్లీ 76(59), అక్స‌ర్ ప‌టేల్ 47(31), శివ‌మ్ దూబే 27(16) ప‌రుగుల‌తో రాణించారు.

విరాట్ కోహ్లీ 76(59) ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ గా, జ‌స్ప్రీత్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ (8 మ్యాచ్ ల‌లో 15 వికెట్లు) గా ఎంపికయ్యారు.

Jasprit Bumrah
RELATED ARTICLES

తాజా వార్తలు