భారత్, శ్రీలంక మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ భారత్ సొంతమైంది. ఆదివారం శ్రీలంక లోని పల్లెకెలెలో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్దతి లో నిర్దేశిత పరుగులను సునాయాసం గా 7 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. రవి బిష్ణోయ్ (3/26), అర్షదీప్ (2/24), హార్దిక్ పాండ్య (2/23), అక్షర్ పటేల్(2/30) ల బౌలింగ్ ప్రతిభతో శ్రీలంక 161 కే పరిమితమయింది.
భారత బ్యాటింగ్ మొదలవగానే వర్షం ప్రారంభం కావడంతో టార్గెట్ ను 8 ఓవర్లకు 78 పరుగులుగా నిర్ణయించారు. యశస్వీ జైస్వాల్(30), సూర్యకుమార్ యాదవ్ (26), హార్దిక్ పాండ్య (22) దూకుడు బ్యాటింగ్ తో 6.3 ఓవర్లలోనే అనుకున్న లక్ష్యాన్ని భారత్ ఛేదించింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రవి బిష్ణోయ్ ఎంపికయ్యారు.
ఈ సిరీస్ లోని తొలి టీ20 మ్యాచ్ లో శ్రీలంక, భారత్ సెట్ చేసిన పరుగుల ఛేదనలో పోరాడి ఓడింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత జరిగిన ఈ సిరీస్ కు కోచ్ గా గౌతమ్ గంభీర్, కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.