Indore Court | తల్లిద్రండులు తమ పిల్లలను చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటూ విద్యా బుద్ధులు నేర్పిస్తుంటారు. ఎన్నో కష్టపడి సంపాదించిన సొమ్ముతో పిల్లలను ఉన్నత విద్యలు చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే, జీవితచరమాంకంలో ఆ తల్లిదండ్రులను బిడ్డలు ఏమాత్రం ఆదరించడం లేదు. కొందరు తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వేస్తుండగా.. మరికొందరు తల్లిదండ్రులన్న గౌరవం లేకుండా మలి వయసులో ఇంట్లో నుంచి గెంటివేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మానవత్వానికి మాయని మచ్చలుగా మిగులుతున్నాయి.
ఈ క్రమంలో ఇండోర్ కోర్టు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఆస్తులపై కూతుళ్లకు హక్కుతో పాటు వృద్ధాప్యంలో చూసుకునే బాధ్యత కూడా ఉంటుందని స్పష్టం చేసింది. వృద్ధురాలైన తల్లికి భరణం చెల్లించాల్సిందేనని ఓ కూతురిని హైకోర్టు ఆదేశించింది. నెలనెలా కొంత డబ్బు తల్లికి ఇవ్వాలనం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కోర్టు తీర్పును వెలువురించింది. వివరాల్లోకి వెళితే.. తన కూతురు ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. తనకు ఒక కూతురు ఉన్నదని.. భర్త చనిపోయాక కూతురుతోనే ఉంటున్నానని చెప్పుకొచ్చింది.
భర్త నుంచి తనకు అందిన సొమ్ము, ఇంటిని కూతురు లాగేసుకుందని.. ఆపై ఆమె ఇంట్లోనే తనకు కాస్త చోటు ఇచ్చిందని పేర్కొంది. కరోనా సమయంలో కూతురు తనను కొట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టింది. దీంతో వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. వృద్ధురాలి అభ్యర్థనపై విచారణ జరిపిన అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయావిశ్వలాల్ వృద్ధురాలికి నెలానెలా రూ.3వేలు పంపాలని కూతురును ఆదేశించింది. చీరెల దుకాణం నిర్వహిస్తూ రూ.22వేల వరకు సంపాదిస్తున్న కూతురు.. తన తల్లి పోషణ బాధ్యతను తప్పించుకోజాలదంటూ తీర్పును వెలువరించింది.