Sunday, December 29, 2024
HomeCinemaIndraja|గుండెలు బ‌ద్ద‌ల‌య్యేలా ఏడ్చిన ఇంద్ర‌జ‌.. ర‌ష్మీ ఓదార్చిన ఆగ‌ని క‌న్నీరు

Indraja|గుండెలు బ‌ద్ద‌ల‌య్యేలా ఏడ్చిన ఇంద్ర‌జ‌.. ర‌ష్మీ ఓదార్చిన ఆగ‌ని క‌న్నీరు

Indraja| ఒక‌ప్పుడు హీరోయిన్స్‌గా వెండితెరపై సంద‌డి చేసి ఇప్పుడు రీఎంట్రీలో బుల్లితెర‌పై ప్రేక్ష‌కులకి మంచి వినోదం పంచుతున్న అందాల భామ‌లు చాలా మందే ఉన్నారు. వారిలో ఇంద్ర‌జ ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అనేక చిత్రాలు చేసిన ఈమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మ‌రింత ద‌గ్గ‌రైంది. ఇంద్ర‌జ ఈ షోల‌లో త‌న‌దైన పంచ్‌లు వేస్తూ తెగ న‌వ్విస్తుంది. అలానే కొన్ని సంద‌ర్భాల‌లో కూడా ఎమోష‌న‌ల్ అవుతుంటుంది. ఆ మ‌ధ్య ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా క్లాసిక‌ల్ డ్యాన్స్ చేసి ఆ త‌ర్వాత క‌న్నీరు పెట్టుకుంది.

క్లాసిక‌ల్ డ్యాన్స్ చేసేట‌ప్పుడు తాను చాలా ఆనందం పొందిన‌ట్టు చెప్పిన ఈ భామ ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అంటూ ఏడ్చేసింది. ఆమె బాధపడటం చూసి యాంకర్ రష్మీ.. మిగతా వారు కూడా క‌న్నీరు పెట్టుకున్నారు. ఇక తాజాగా మ‌ద‌ర్స్ డే స్పెష‌ల్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఇందులోను ఇంద్రజ వెక్కి వెక్కి ఏడ‌వ‌డం జ‌రిగింది. మే 12న మదర్స్ డే కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ వారు ప్లాన్ చేసిన స్పెష‌ల్ ఎపిసోడ్ చాలా స‌ర‌దాగాను, ఎమోష‌న‌ల్‌గాను సాగిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. షోలో అంజ‌లి, ఫైమా వంటి వారు వారి త‌ల్లుల‌తో హాజ‌ర‌వుతారు. ఇక గెట‌ప్ శీను తాను న‌టిస్తున్న రాజు యాద‌వ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా అక్క‌డికి వ‌స్తాడు.

ఇక మదర్స్ డే సందర్భంగా బులెట్ భాస్కర్, ఇమ్మాన్యూల్, నూకరాజు, పొట్టి నరేష్ వంటి కమెడీయ‌న్స్ ఇంద్ర‌జ‌ని త‌ల్లిలా భావించి ఆమెకి స‌న్మానం చేసి కొన్ని బ‌హుమ‌తులు ఇచ్చారు. నూక‌రాజు అయితే ఏకంగా చీర‌నే గిఫ్ట్‌గా ఇచ్చాడు. వారి ప్రేమ‌ని చూసి ఇంద్ర‌జ చాలా ఎమోష‌న‌ల్ అయింది. అయితే మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఇంద్ర‌జ కూడా ఎమోష‌న‌ల్ అయింది. త‌న త‌ల్లి ఓ గుడికి తీసుకెళ్లమని ఎన్నో సార్లు అడిగింది. కాని ఆమె కోరిక‌ని నేను తీర్చ‌లేక‌పోయాను. అమ్మ ఒక్క‌సారి వ‌స్తే నాకు ఆ కోరిక తీర్చాల‌ని ఉంది. మనం బ‌య‌టి వాళ్లకి ఎంత చేసిన త‌ల్లిదండ్రుల‌కి చేయ‌క‌పోతే ప్ర‌యోజ‌నం ఉండదు. మన జీవితంలో ఎన్ని రిలేషన్స్ ఉన్నా సరే తల్లి తండ్రి లేకుంటే వారు అనాధ‌ల‌తో స‌మానం అంటూ చాలా ఎమోష‌న‌ల్ అయింది. ర‌ష్మీ ఓదార్చే ప్ర‌య‌త్నం చేసిన కూడా ఇంద్ర‌జ త‌న క‌న్నీటిని ఆపుకోలేక‌పోయింది.

RELATED ARTICLES

తాజా వార్తలు