Thursday, April 3, 2025
HomeTelanganaInter Supplementary Exams | ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఎగ్జామ్స్‌.. వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు

Inter Supplementary Exams | ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఎగ్జామ్స్‌.. వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు

హైద‌రాబాద్: తెలంగాణ‌ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు (Inter Supplementary Exams) ఈ నెల‌ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే షెడ్యూల్ కూడా విడుద‌ల‌యింది. తాజాగా ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వ‌చ్చాయి. స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు రాసే విద్యార్థులు త‌మ హాల్‌టికెట్ల‌ను ఇంట‌ర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్న త‌ర్వాత విద్యార్థులు త‌మ ఫొటో, సంత‌కం, పేరు, మీడియంతో పాటు ఏయే స‌బ్జెక్టులు రాస్తున్నామో వాటిని గ‌మ‌నించాలి. వాటిలో ఏవైనా త‌ప్పులు ఉంటే త‌క్ష‌ణ‌మే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ను సంప్ర‌దించాలి. హాల్ టికెట్ల‌పై ప్రిన్సిపాల్స్ సంత‌కాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ ప‌రీక్ష రాసేందుకు అనుమ‌తించాల‌ని ఇంట‌ర్ బోర్డు చీఫ్ సూప‌రింటెండెంట్ల‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఫ‌స్టియ‌ర్ పరీక్షలు..

మే 24: Part II – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మే 25: Part I -ఇంగ్లిష్ పేపర్-1
మే 28: Part -III -గణితం పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
మే 29: గణితం పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
మే 30: ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
మే 31: కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
జూన్‌ 01: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (BiPC Students)
జూన్ 03: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1

సెకండియర్ సప్లిమెంటరీ..

మే 24: Part II – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
మే 25: Part I -ఇంగ్లిష్ పేపర్-2
మే 28: Part -III -గణితం పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
మే 29: గణితం పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
మే 30: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
మే 31: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
జూన్ 01: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2(BiPC Students)
జూన్ 03: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2

ప‌రీక్ష‌ల‌ను ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఫ‌స్టియ‌ర్ విద్యార్థుల‌కు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంట‌ల‌కు వ‌ర‌కు సెకండియ‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు