Friday, December 27, 2024
HomeBusinessInvestments | భ‌విష్య‌త్ ఆర్థిక భ‌ద్ర‌త కోసం.. ఈ ఐదు పెట్టుబ‌డులు అద్భుతం..!!

Investments | భ‌విష్య‌త్ ఆర్థిక భ‌ద్ర‌త కోసం.. ఈ ఐదు పెట్టుబ‌డులు అద్భుతం..!!

Investments | ప్ర‌తి ఒక్క‌రూ జీవితంలో ఆర్థికంగా ఎద‌గాల‌ని కోరుకుంటారు. అందుకు త‌గ్గ‌ట్టు శ్ర‌మిస్తారు. ప్ర‌తి రూపాయి కూడా కూడ‌బెడుతారు. ఇక క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్ము ఇత‌రుల పాలుకాకుండా ఉండేలా, న‌ష్ట‌పోకుండా ఉండేందుకు మ‌రింత రాబ‌డి సంపాదించాల‌ని అనుకుంటారు. అలాంటి వారు అనేక మార్గాల ద్వారా పెట్ట‌బ‌డులు పెట్టుకోవ‌చ్చు. ఈ పెట్టుబ‌డులు ఆర్థిక భ‌ద్ర‌త‌ను ఇవ్వ‌డ‌మే కాకుండా, ధ‌నాన్ని రెట్టింపు కూడా చేస్తాయి. ప్ర‌ధానంగా దీర్ఘ‌కాలిక‌, మ‌ధ్య‌కాలిక‌, స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాల‌ను సాధించ‌డానికి వీలుక‌ల్పిస్తాయి. భ‌విష్య‌త్‌లో ఆర్థిక భ‌రోసా త‌ప్ప‌కుండా కావాలంటే.. ముఖ్య‌మైన ఈ ఐదు పెట్టుబ‌డుల గురించి తెలుసుకోవాలి.

బంగారం, వెండి ఈటీఎఫ్‌

చాలా మంది తాము సంపాదించిన దాంట్లో కొంతమేర బంగారం, వెండి కొనుగోలుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఎందుకంటే బంగారం క‌ష్ట స‌మ‌యంలో ఆదుకుంటుంద‌నే న‌మ్మ‌కం. కాబ‌ట్టి బంగారం, వెండిపై పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల భ‌విష్య‌త్‌లో మంచి రాబ‌డిని పొందే అవ‌కాశం ఉంటుంది. ఈ రెండు పెట్టుబ‌డులు ద్ర‌వ్యోల్బ‌ణం భారం నుంచి మిమ్మ‌ల్ని కాపాడుతాయి. గోల్డ్ అండ్ సిల్వ‌ర్ ఈటీఎఫ్‌లు మీ పోర్ట్‌ఫోలియోను కూడా మెరుగుప‌రుస్తాయ‌ని బిజినెస్ ఎక్స్‌ప‌ర్ట్స్ సూచిస్తున్నారు.

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం..

ఇక ఆర్థికంగా స్థిర‌ప‌డిన వారు.. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచి ఆప్ష‌న్. రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెడితే.. 99 శాతం లాభాల‌ను గ‌డించే అవ‌కాశం ఉంటుంది. సొంత భూమి, ఇల్లు ఉంటే.. వాటిని కిరాయికి ఇవ్వ‌డం ద్వారా, లేదంటే అమ్మ‌కం ద్వారా లాభాలు పొందొచ్చు. త‌ద్వారా మీ ధ‌నం రెట్టింపు కూడా అవుతుంది. అయితే ఇందులో పెట్టుబడులకు ఎక్కువ మూలధనం అవసరం కావడం వల్ల చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.

ఈక్విటీలు

ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి రాబడిని పొందొచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించే దీర్ఘకాలిక లాభాలను సంపాదించవచ్చు. మీరు నేరుగా ఈక్విటీలలో పెట్టుబడి పెట్టకూడదనుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ మరో ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. దీర్ఘకాల రాబడిని ఆళించేవారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్​గా ఉంటాయి.

నేషనల్ పెన్షన్ సిస్టమ్

నెలవారీ పెన్షన్ పొందేందుకు మరో బెస్ట్ స్కీమ్ ‘నేషనల్ పెన్షన్ సిస్టమ్’. దీంట్లో చేరిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేయాలి. అత్యవసర సమయాల్లో 60 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు. మిగతాది యాన్యుటీకి వెళ్తుంది. దీనిని పెన్షన్ రూపంలో అందుకోవచ్చు. అందుకే దీన్ని సేవింగ్స్ కమ్ రిటైర్మెంట్ స్కీమ్​గా పిలుస్తారు. ఎన్‌పీఎస్​లో పెట్టుబడులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపులను పొందొచ్చు. అయితే, ఎన్‌పీఎస్​లో గరిష్ట ఈక్విటీ కేటాయింపు 75 శాతం మాత్రమే ఉంటుంది.

డెట్ ఫండ్లు/ బాండ్లు

ఈక్విటీలతో పోలిస్తే డెట్ ఫండ్లు, బాండ్లలో పెట్టుబడుల్లో తక్కువ రిస్క్ ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ మంచి రాడిని అందిస్తుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు