Sunday, December 29, 2024
HomeSportsIPL 2024| ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. క్వాలిఫ‌య‌ర్స్‌లో ఏయే జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి...!

IPL 2024| ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. క్వాలిఫ‌య‌ర్స్‌లో ఏయే జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి…!

IPL 2024| ఐపీఎల్ సీజ‌న్ 17 చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇన్నాళ్లు ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జా అందించిన ధనాధ‌న్ టోర్నీలో లీగ్ మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. ఇక ప్లేఆఫ్స్ పోరు ఉండనుంది. రాజస్థాన్ రాయల్స్, కోల్‍కతా నైట్‍రైడర్స్ మధ్య గౌహతి వేదికగా జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కి మంచి అవ‌కాశం ద‌క్కింది. రెండో ప్లేస్ కోసం రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా ప్ర‌య‌త్నించింది. కోల్‌క‌తాతో జ‌ర‌గాల్సిన లీగ్ మ్యాచ్ ర‌ద్దు కాక‌పోయి ఉంటే ఎలా అయిన ఆ మ్యాచ్‌లో గెలిచి రెండో స్థానానికి చేరుకోవాల‌ని ఆర్ఆర్ టీం భావించింది. కాని వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో సన్‍రైజర్స్ హైదరాబాద్ రెండో ప్లేస్‍ను నిలబెట్టుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‍ల్లో 9 గెలిచి, 3 ఓడిన కోల్‍కతా తొలి స్థానంలో నిలిచింది. ప్ర‌స్తుతం ఆ టీమ్‌కి 20 పాయింట్స్ ఉన్నాయి.

ఇక రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్‍ల్లో 8 గెలిచి, 5 ఓడింది. ఒక మ్యాచ్ రద్ధైంది. దీంతో ఆ జ‌ట్టు 17 పాయింట్లను పొందింది. ఇక సన్‍రైజర్స్ హైదరాబాద్ కూడా 14 మ్యాచ్‍ల్లో 8 గెలిచి, ఐదు ఓడగా.. ఆక మ్యాచ్ రద్దయింది. దీంతో 17 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. అయితే, రాజస్థాన్ 0.273 నెట్‍రన్ రేట్‍తో ఉంటే హైదరాబాద్ అంతకు మించి 0.414 నెట్‍ రన్‍రేట్‍తో ఉండ‌డం వారికి క‌లిసి వ‌చ్చింది.ఈ క్ర‌మంలో కోల్‌కతా టాప్ లో ఉంటే రెండో స్థానంలో స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్, మూడో స్థానంలో రాజ‌స్థాన్, నాలుగో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచాయి.

ఇక ప్లేఆఫ్స్ మే 21న మొదలుకానుండ‌గా, ఇందులో కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు త‌ల‌ప‌డ‌పోతున్నాయి. ఈ సీజన్‍లో టాప్-2లో ఉన్న కోల్‍కతా నైట్ రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్ మే 21న క్వాలిఫయర్ 1 ఆడనున్నాయి. ఇందులో గెలిచిన జ‌ట్టు డైరెక్ట్‌గా ఫైన‌ల్ చేరుకుంటుంది. ఓడిన జ‌ట్టు మే 22న జ‌ర‌గ‌నున్న మ‌రో క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌తో ఆడుతుంది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ జరగ‌నుండ‌గా, ఇందులో ఓడిన జ‌ట్టు టోర్నీ నుండి నిష్క్ర‌మిస్తుంది. గెలిచిన జట్టు.. క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్‍తో ఆడుతుంది. ఇక ఇందులో గెలిచిన జ‌ట్టు ఫైనల్ చేరుకుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు