Saturday, December 28, 2024
HomeAndhra PradeshAP DGP | ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న డీజీపీగా ద్వారకా తిరుమ‌లరావు..!

AP DGP | ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న డీజీపీగా ద్వారకా తిరుమ‌లరావు..!

AP DGP | అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ కేవీ రాజేంద్ర‌నాథ రెడ్డిపై ఎన్నిక‌ల సంఘం బ‌దిలీ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కొత్త డీజీపీ ఎవ‌రు అనే అంశంపై ఏపీ అంత‌టా తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఏ ఆఫీస‌ర్‌ను డీజీపీ ప‌ద‌వి వ‌రిస్తుందోన‌ని పోలీసు వ‌ర్గాల్లో కూడా ఉత్కంఠ కొన‌సాగుతోంది. అయితే ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కొన‌సాగుతున్న సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు డీజీపీగా నియామ‌కం అవుతార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ద్వార‌కా తిరుమ‌ల‌రావు ప్ర‌స్తుతం సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. తిరుమ‌ల‌రావు త‌ర్వాత స్థానాల్లో రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మ‌న్ అంజ‌నా సిన్హా(1990 బ్యాచ్), 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్ర‌తాప్ ఉన్నారు. కొత్త డీజీపీ కోసం ఈ ముగ్గురి పేర్ల‌ను ప్యానెల్ జాబితాలో పంపించే అవ‌కాశం ఉంది. ఈ ముగ్గురిని కూడా కాద‌నుకుంటే.. హోంశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్న 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హ‌రీశ్ కుమార్ గుప్తా పేరు జాబితాలో చేరొచ్చు. ఇక కొత్త డీజీపీ ఎవ‌ర‌నేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు