Ebrahim Raisi | ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కూలిపోయిన విషయం తెలిసిందే. సోమవారం ఇబ్రహీం రైసీ ప్రయాణించిన విమానం హెలికాప్టర్ కూలిన ప్రదేశం, శకలాలను గుర్తించినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రకటించింది. అయితే, ఈ ప్రాంతంలో ఎవరూ బతికున్నారనే ఆనవాళ్లు కనిపించలేదని వార్తాసంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. మానవరహిత విమానాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. అజర్‌బైజాన్ అధ్యక్షుడితో కలిసి ఆయన ఆదివారం డ్యామ్‌ను ప్రారంభించారు.
అనంతరం ఆయన చాపర్‌లో బయలుదేరగా.. జోల్ఫా నగర సమీపానికి చేరుకోగానే రైసీ ప్రయాణిస్తున్న చాపర్ కూలిపోయింది.ఈ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్‌అమీర్, అబ్దోల్లాహియాన్‌తోపాటు, తబ్రీజ్‌ఇమామ్‌అయతుల్లా మొహమ్మద్‌అలీ అల్‌ఏ హేమ్, ఇరాన్‌ప్రావిన్స్‌ఆఫ్‌ఈస్ట్‌అజర్‌బైజాన్‌గవర్నర్‌మాలెక్‌రహ్మతి విమానంలో ఉన్నారని ఐఆర్‌ఎన్‌ఏ స్టేట్‌వార్తా సంస్థ తెలిపింది. అధ్యక్షుడి రక్షణ విభాగం కమాండర్ సర్దార్ సయ్యద్ మెహదీ మౌసవీతో పాటు పలువురు అంగరక్షకులు, హెలికాప్టర్‌సిబ్బంది ప్రాణాలు విడిచారు.