టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నతూర్ప్ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ అధికారిక మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది. ఆ సమయంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌తోపాటు కాన్వాయ్‌లో మరో రెండు హిలాకప్టర్లు ఉన్నట్లు తెలిపింది. అయితే, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని, ప్రతికూల వాతావరణం ఇందుకు అవరోధంగా మారిందని పేర్కొంది. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోందని, గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
ఇబ్రహీం రైసీ(63) ఆదివారం అజర్‌బైజాన్ పర్యటనకు వెళ్లారు. అరస్ నదిపై రెండు దేశాలు కలిసి నిర్మించిన డ్యామ్‌ను ఆ దేశ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్‌తో కలిసి రైసీ ప్రారంభించాల్సి ఉన్నది. అయితే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రైసితోపాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హోసేన్ అమిరాబ్దోల్లాహియన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, పలువురు అధికారులు కూడా ఉన్నారు.
ఇరాన్ అధ్యక్షుడు రైజి ప్రయాణిస్తున్న ఛాపర్‌కు ప్రమాదం
ఛాపర్ ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్తున్న రెస్క్యూ సిబ్బంది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/PPW98wS7Ri
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2024