Saturday, January 4, 2025
HomeNationalISRO | ఇస్రో మరో ఘనత.. పీఎస్‌-4 రాకెట్‌ ఇంజిన్‌ టెస్ట్‌ విజయవంతం..!

ISRO | ఇస్రో మరో ఘనత.. పీఎస్‌-4 రాకెట్‌ ఇంజిన్‌ టెస్ట్‌ విజయవంతం..!

ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించింది. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందించిన పీఎస్4 రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించింది. హాట్ టెస్టింగ్ పేరుతో నిర్వహించి పరీక్షల్లో ఇస్రో పీఎస్4 ఇంజిన్‌ను 664 సెకెన్ల పాటు మండించింది. ఏఎం టెక్నాలజీతో (3డీ ప్రింటింగ్) ఈ ఇంజిన్‌ను తయారీ చేసినట్లు పేర్కొంది. ఈ సాంకేతికతతో ముడిసరుకులో 97శాతం, ఉత్పత్తి సమయంలో 60శాతం ఆదా అవుతుందని వెల్లడించింది. ద్రవ ఇంధన ఆధారిత పీఎస్4ను పీఎస్‌ఎల్‌వీ రాకెట్ చివరి దశలో వినియోగిస్తుంటారు.

త్వరలోనే దీన్ని పీఎస్‌ఎల్‌వీ రాకెట్లలో వినియోగించనున్నారు. ప్రస్తుతం పీఎస్4 ఇంజిన్‌ను సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేస్తున్నది. పీఎస్‌ఎల్‌వీ నాలుగో దశలో వాడుతున్నారు. పీఎస్ఎల్‌వీ మొదటి దశలో రికాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో కూడా దీన్ని వాడతారు. ఈ ఇంజిన్‌లో ఇంధనంగా మిథైల్ హైడ్రజీన్, ఆక్సిడైజర్‌గా నైట్రోజన్ టెట్రాక్సైడ్ వాడతారు. అయితే, ప్రస్తుతం 3డీ ప్రింటింగ్‌కు అనుకూలంగా లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ పీఎస్‌4 ఇంజిన్‌ డిజైన్‌లో మార్పులు చేసింది. లెజర్ పౌడర్ బెస్ట్ ఫ్యూజన్ సాంకేతికత వినియోగంతో ఇంజిన్‌లో విడిభాగాల సంఖ్య 14 నుంచి ఒకటికి ఇస్రో తగ్గించగలిగింది. ఇంజిన్‌ను భారతీయ సంస్థ విప్రో 3డీ తయారు చేయగా తమిళనాడులోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో విజయవంతంగా ఇస్రో పరీక్షించింది.

RELATED ARTICLES

తాజా వార్తలు