Jabardasth| బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ వెలుగులోకి వచ్చారు. వారిలో ముక్కు అవినిష్ ఒకరు. ప్రత్యేకమైన కామెడీతో తిరుగులేని కమెడీయన్‌గా పేరు తెచ్చుకున్న అవినాష్ చాలా రోజులు పాటు జబర్ధస్త్‌లో పని చేశాడు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందో అప్పుడు జబర్ధస్త్‌కి గుడ్ బై చెప్పి మా టీవీలో పని చేస్తున్నాడు. అయితే టీవీ షోస్‌తో పాటు సినిమాలలో కూడా అవకాశాలు సంపాదించుకుంటున్న అవినాష్ రీసెంట్‌గా ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఆయన ఈ ఇంటర్వ్యూలో జబర్ధస్త్‌కి సంబంధించిన విషయాలని, రెమ్యునరేషన్ వివరాలని కూడా వెల్లడించాడు.
జబర్ధస్త్ షోలో కామెడీ చేసిన వారికే అవకాశం ఉంటుంది. కొంచెం తేడా వచ్చిన వెంటనే తీసేస్తారు. అభి తనని జబర్ధస్త్‌లోకి తీసుకొచ్చినట్టు చెప్పిన అవినాష్ మొదట్లో చాలా ఇబ్బంది పడ్డట్టు చెప్పుకొచ్చాడు. తొలుత కంటెస్టెంట్‌గా ఉన్న నేను ఆ తర్వాత కార్తీక్‌తో టీమ్ లీడర్‌గా పని చేశాను అని అన్నాడు. జబర్ధస్త్‌లో రాజకీయాలు ఉంటాయట, వాటిని తట్టుకొని నిలబడడం కష్టమా అన్న దానికి అవినాష్ స్పందిస్తూ..అవును రాజకీయాలు కూడా ఉంటాయి. వాటిని ఎదుర్కోక తప్పదు. నేను బతకనేర్చిన వాడిని కాబట్టి నా దగ్గర ఎవరైన రాజకీయాలు చేస్తే వెంటనే చెప్పేసే వాడిని. ఏవైనా ఉంటే మొహం మీదే చెప్పాలి తప్ప, రాజకీయాలు చేయోద్దు అనే వాడిని. నేను సీనియర్స్‌తో, డైరెక్టర్‌తో క్లోజ్‌గా ఉంటాను. ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటాను. అవసరం ఉన్నప్పుడు నేను డైరెక్టర్స్‌తో పోటీ పడేవాడిని..
మంచి స్కిట్స్ చేశాక, టీమ్ లీడర్ అయ్యాక తనకు జబర్ధస్త్‌పై నమ్మకం వచ్చింది తెలిపాడు. ఇక తన పారితోషికం గురించి మాట్లాడుతూ.. టీమ్ లీడర్‌గా ఉన్నప్పుడు వారానికి మిగిలేది ఎనిమిది నుండి పదివేలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇక వచ్చే పారితోషికంలో కంటెస్టెంట్లకి, అసిస్టెంట్లకి ఇచ్చాక తనకు, కార్తిక్ చెరో 8 వేలు మిగిలేవని తెలిపారు అవినాష్. జబర్ధస్త్ పారితోషికాలు చాలా తక్కువగా ఉంటాయి, కాకపోతే ఆ పేరుతో బయట ఈవెంట్స్ లో బాగా సంపాదించుకుంటామని వాటితోనే జీవితం గడుస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు అవినాష్.