Friday, April 4, 2025
HomeCinemaSreemukhi | త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న శ్రీముఖి..! వెల్లడించిన జబర్దస్త్‌ కమెడియన్‌ అవినాశ్‌..

Sreemukhi | త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న శ్రీముఖి..! వెల్లడించిన జబర్దస్త్‌ కమెడియన్‌ అవినాశ్‌..

Sreemukhi | టాలీవుడ్‌ యాంకర్‌ శ్రీముఖి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నది. ఈ విషయాన్ని జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాశ్‌ తెలిపాడు. అవినాశ్‌, శ్రీముఖి ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఇద్దరు కలిసి పలు ఛానెల్స్‌లో షోలు సైతం చేస్తున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాశ్ శ్రీముఖి పెళ్లి వార్తలపై సైతం స్పందించాడు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని.. సంబంధం కుదిరితే ఈ సంవత్సరంలోనే జరిగిపోవచ్చని చెప్పాడు. శ్రీముఖి స్వస్థలం నిజామాబాద్‌.

అనుకోకుండా టెలివిజన్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీముఖి తండ్రి సాధారణ ఉద్యోగి. తల్లి బ్యూటీ పార్లర్‌ నడుపుతుండేవారు. అయితే, ఓ షో కోసం ఈటీవీ ఛానల్ సిబ్బంది.. హౌస్ వైఫ్స్, లేడీస్‌పై షో సమయంలో శ్రీముఖి తల్లి బ్యూటీ పార్లర్‌ గురించి తెలుసుకున్నారు. ఓ ఎపిసోడ్‌ కోసం ఆమె ఇంటికి వెళ్లారు. అదే సమయంలో శ్రీముఖిని చూసిన షో నిర్వాహకురాలు టీవీ ఛానెల్‌ కొత్తగా నిర్వహిస్తున్న అదుర్స్‌ షోలో శ్రీముఖి ఛాన్స్‌ ఇచ్చారు. మొదట్లో శ్రీముఖి తండ్రి ఆ ఆఫర్‌ని అంగీకరించలేదు. కానీ, ఆ తర్వాత ఆమె తల్లి అంగీకరించింది.

దాంతో శ్రీముకి యాంకర్‌ జర్నీ మొదలైంది. ఆ తర్వాత ఈ టీవీలో చాలా ప్రోగ్రామ్స్‌ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో బెస్ట్‌ యాంకర్‌గా పేరు సంపాదించింది. అలాగే, టాలీవుడ్‌లో పలు సినిమాల్లోనూ నటించింది. ఇదిలా ఉండగా.. ఇటీవల శ్రీముఖి ఓ హీరోతో డేటింగ్‌ చేస్తుందని, ఇద్దరు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ వ్యవహారంపై శ్రీముఖి స్పందించలేదు. అంతకు ముందు యాంకర్‌ ప్రదీప్‌తో లవ్‌లో ఉందని వార్తలు వచ్చాయి.. అందులో వాస్తవం లేదని.. ఇద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని తెలిపారు. తాజాగా మరోసారి శ్రీముఖి పెళ్లి వార్త వైరల్‌గా మారింది.

RELATED ARTICLES

తాజా వార్తలు