Jabardasth| బుల్లితెరకి మంచి ఊపు తీసుకొచ్చిన కామెడీ షో జబర్ధస్త్. ఈ కార్యక్రమం దశాబ్ధకాలంగా ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. జడ్జిలు మారిన, కంటెస్టెంట్స్ మారిన కూడా షోకి మంచి ఆదరణ దక్కింది. ప్రారంభంలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు అనే విమర్శలు వచ్చినా, ఆ తర్వాత మాత్రం షోకి ఆదరణ బాగానే లభించింది. జబర్ధస్త్‌కి మంచి రేటింగ్ వస్తుండడంతో ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కూడా మొదలు పెట్టారు. రెండు భాగాలుగా వచ్చే ఈ కామెడీ షో తెలుగు రాష్ట్రాల్లో ఇంటిళ్లిపాదిని ఎంతగానో నవ్వించింది. అయితే ఇటీవల ఈ షోకి కాస్త కళ తప్పింది. యాంకర్లు, జడ్జ్ లు, స్టార్ కమెడియన్లు మారిపోతూ ఉండడంతో రేటింగ్ కూడా క్రమేమి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో మల్లెమాల వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ ప్రారంభం అయిన తర్వాత లాక్‌డౌన్ సమయంలో తప్పితే ఏనాడు కూడా ఆ షోలకి బ్రేక్ పడలేదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులలో అయిన షోని సక్సెస్ ఫుల్ గా రన్ చేశారు. అయితే అనుకోని పరిస్థితుల వలన ఈ వారం నుంచే ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోను ఆపేస్తున్నట్లు, ఇకపై గురు, శుక్రవారాల్లో జబర్ధస్త్ మాత్రమే ప్రసారం అవుతున్నట్లు తాజాగా వచ్చిన ప్రోమోలో చెప్పారు. ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోను ఆపేస్తున్నట్లు ఆటో రాంప్రసాద్ తన స్కిట్ రూపంలో తెలియజేశాడు. ‘మాకు రెండు కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి ఒకటే చేస్తానంటున్నారు. నేను ఫస్ట్ నుంచీ ఇందులోనే ఉన్నాను. సడన్‌గా వెళ్లిపోతుంటే బాధగా ఉంది. ఎందులోకి వెళ్లినా సంపాదిస్తాము కానీ, ఇందులో సంతోషం ఉంటుంది’ అంటూ బాధని బహిర్గతం చేశాడు.
‘మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అది మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు రామ్ ప్రసాద్. అనంతరం యాంకర్ రష్మీ ‘ఎక్స్‌స్ట్రా’ పదం మిస్ అవుతుంది. కానీ రెండు ఎపిసోడ్స్ వస్తాయి అంటూ షోకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది. ఈ షో రెండు రోజులు వచ్చిన కూడా ఎక్స్‌ట్రా అనే పదం ఉండదని కాకపోతే ఎక్స్‌స్ట్రా ఎనర్జీతో షో మిమ్మల్ని అలరించనుందని అని అన్నారు. ఇక షో క్యాన్సిల్ చేస్తున్నందుకు అందరు ఎమోషనల్ అయ్యారు.