Saturday, December 28, 2024
HomeCinemaJagapathi Babu| హీరోయిన్స్‌తో షాపింగ్స్, పార్టీల వ‌ల్ల‌నే జ‌గ‌ప‌తి బాబు దివాళా తీసారా..!

Jagapathi Babu| హీరోయిన్స్‌తో షాపింగ్స్, పార్టీల వ‌ల్ల‌నే జ‌గ‌ప‌తి బాబు దివాళా తీసారా..!

Jagapathi Babu| విలక్షణ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నాడు.విల‌న్‌గా, ఇత‌ర స‌పోర్టింగ్ పాత్ర‌ల‌తో మెప్పిస్తున్నాడు జగపతి బాబుకి ఇండస్ట్రీలో సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉందని చెప్పాలి. వెండితెరపై ఆయన మ్యానరిజం, యాక్టింగ్‌ స్కిల్స్‌, స్టైల్‌కి ఫ్యాన్స్ విజిల్స్ వేయ‌కుండా ఉండ‌లేరు. ఏ విష‌యంలో అయిన మొహ‌మాటం లేకుండా మాట్లాడుతూ వార్త‌లలో నిలుస్తుంటాడు జ‌గ‌ప‌తిబాబు. ఆయ‌న పొలిటికల్, సామాజాకి అంశాల‌పైన కూడా త‌న గొంతు వినిపిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటారు. అయితే ఒక‌ప్పుడు చాలా గొప్ప‌గా బ్ర‌తికిన జ‌గ‌ప‌తిబాబు మ‌ధ్య‌లో అనేక ఇబ్బందులు ప‌డ్డాడు.

ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న జ‌గ‌ప‌తి బాబు ఎన్నడూ చూడని కష్టాలు పడ్డారు. కాగా తన ఆర్థిక ఇబ్బందులకు కారణాలేంటో జగపతిబాబు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. జగపతిబాబు జూదంలో డబ్బు పోగుట్టుకున్నారనే ప్రచారం ఉండ‌గా, దానిపై క్లారిటీ ఇచ్చిన జ‌గ్గూభాయ్ నా ఆర్థిక సమస్యలకు జూదం ఒక్కటే కారణం కాదని అన్నారు. తాను జూదం ఆడతానని ఒప్పుకున్న జగపతి బాబు, మహా అయితే జూదంలో రెండు కోట్లు పోగొట్టుకుని ఉంటాను, అంత ఆస్తి పోగొట్టుకోను అని చెప్పారు. ఇక మ‌రి అంత ఆస్తి ఎలా పోగొట్టుకున్నావ‌ని ఆయ‌న‌ని ప్ర‌శ్నించ‌గా, దానికి జ‌గ‌ప‌తిబాబు ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు.

హీరోయిన్లకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల కూడా డబ్బు పోగొట్టుకున్నారని తెలిసింది అని యాంకర్ అడగ‌గా, దానికి స్పందించిన జ‌గ‌ప‌తిబాబు… హీరోయిన్లకు గిఫ్టులు ఇచ్చి ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఆడవారిని అలా తక్కువ దృష్టితో ఎప్పుడు చూడ‌ను, చూడ‌లేదు. హీరోయిన్స్ ని కలిసినప్పుడు, వాళ్ళతో పార్టీలకు వెళ్లినప్పుడు ఖర్చుకు వెనుకాడను. బిల్ నేనే కడతాను. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎవరికైనా స‌రే నా జేబులో డబ్బు ఖర్చు పెడతాను. నాకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్లు షాపింగ్ చేస్తే బిల్ పే చేసేవాడిని. నా ఫ్రెండ్స్ మగ వాళ్లకు కూడా నేను బిల్లులు కట్టాను. నిర్మాతలకు డబ్బులు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఒకెత్తయితే నా దగ్గర డబ్బులు లేని సమయంలో అప్పు తెచ్చి ఇల్లు కట్ట‌డం జరిగింది. వడ్డీల రూపంలోనే రూ. 20 కోట్ల వరకు పోయాయి. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసేవాడిని. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ప‌లువురి చేతిలో మోస‌పోయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ని జ‌గ్గూభాయ్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు