Jagapathi Babu| ఫ్యామిలీ హీరో జగపతి బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో కనిపించి మెప్పించారు. ఇప్పుడు ప్రతినాయకుడిగా అదరగొడుతున్నాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఛాన్సులు అందుకుంటూ బిజీ యాక్టర్ అయిన జగపతిబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన పలు విషయాలని సోషల్ మీడియా ద్వారా పంచుకునే జగపతి బాబు తాజాగా తాను మోసపోయానన్నారు. అలానే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఇప్పుడు జగపతిబాబు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో జరుగున్న మోసాల గురించి మాట్లాడిన జగపతి బాబు ఆ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు . వాళ్ల ట్రాప్లో పడకూడదని అభిమానులకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ‘రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో రీసెంట్గా హెచ్చరించారు. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ యాడ్‌లో నేను యాక్ట్ చేశా. అయితే నన్ను వాళ్లు మోసం చేశారు. వాళ్లు ఎవరు? అసలు ఏం జరిగింది? అనే వివరాలన్నీ త్వరలో చెబుతా. భూమి కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రూల్స్ కచ్చితంగా తెలుసుకోండి’ అని జగపతి బాబు పేర్కొన్నారు.ఎవరి ట్రాప్లో పడొద్దు’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు ఈ నటుడు. దీంతో జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి
క్యారెక్టర్ ఆర్టిస్టుగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు జగపతి బాబు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన సలార్ మూవీలో కనిపించిన జగపతి బాబు… ఇప్పుడు సలార్ 2 ప్రాజెక్టులోనూ కనిపించనున్నాడు. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’లో జగపతి బాబు భాగమయ్యారు. ఇందులో ఆయనది పవర్ఫుల్ రోల్ అని మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. అందులో ఆయన లుక్కు సంబంధించిన ఫొటోను కూడా రిలీజ్ చేసింది. ఇంటెన్స్ లుక్‌లో శక్తిమంతంగా కనిపించారు జగపతి బాబు