Sunday, December 29, 2024
HomeTelanganaJaggareddy | కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్న ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు: మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి

Jaggareddy | కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్న ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు: మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి

హైద‌రాబాద్‌: లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత రాష్ట్రంలో స‌రికొత్త శ‌క్తిగా అవ‌స‌రిస్తామంటున్న బీజేపీ (BJP) రాష్ట్ర నాయ‌క‌త్వానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వ‌నున్నారా..? తెలంగాణ‌లో (Telangana) అత్య‌ధిక ఎంపీ స్థానాలు త‌మ‌వే నంటున్న బీజేపీ అధిష్ఠానానికి శాస‌న‌స‌భ్యులు హాండిస్తారా? అంటే అవున‌నే అంటున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి (Jaggareddy). బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వ‌స్తున్నారంటూ సంచ‌లన వ్యాఖ్యలు చేశారు. త్వ‌ర‌లోనే వారంతా త‌మ పార్టీలో చేరుతున్నార‌ని తెలిపారు. అలాగే బీఆర్ఎస్‌కు నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నార‌ని చెప్పారు. దీంతో తమ బలం 90కి పెరుగుతుందని తమ ప్రభుత్వానికి వచ్చిన ప్ర‌మాదం ఏమీ లేద‌ని స్పష్టం చేశారు.

లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల‌కు ముందు బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, క‌డియం శ్రీహ‌రి, తెల్లం వెంక‌ట్రావ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసింది. దానం ఏకంగా సికింద్రాబాద్‌ లోక్‌స‌భ స్థానం నుంచి పోటీచేయ‌గా, క‌డియం శ్రీహ‌రి కూతురు కావ్య వ‌రంగ‌ల్ ఎంపీగా బ‌రిలో నిలిచారు. రాజేంద్ర న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్ హ‌స్తం పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకున్న విష‌యం తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చే సీట్ల‌ను బ‌ట్టి ఈ చేరిక‌లు ఉండ‌నున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

కాగా, గాంధీ భ‌వ‌న్‌లో నేడు మీడియాతో మాట్లాడిన జ‌గ్గారెడ్డి.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌పై మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీకి ఇబ్బంది లేకుండా తమ ప్రభుత్వం వ్యవహారించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికల్లో అధికారన్ని వాడుకొని ఇతర పార్టీలను ఇబ్బందికి గురిచేశాయన్నారు. లక్ష్మణ్ తమ పార్టీ నేతలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై పండితుడు లాగా జాతకాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన కామెంట్స్ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‎కు ఈ ఎన్నికల్లో కూడా క్లియర్ మెజారిటీ ఇచ్చారన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలాంటి డోకా లేకుండా నడుస్తుందన్నారు. కాంగ్రెస్‎లో బీఆర్ఎస్ విలీనం అంటున్నారు.. కేసీఆర్‎కి అంత అవసరం ఏమొచ్చిందని అడిగారు. లక్ష్మణ్ మాటలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు ఉన్నాయని చురకలు అంటించారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు