Jahnvi kapoor| అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ చేసింది తక్కువ సినిమాలే అయిన స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. హిందీలో ‘ధడక్’ మూవీతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజై పాజిటివ్ టాక్ అందుకుంది. ఆ తర్వాత జాన్వీ కపూర్ చేసిన ఏ సినిమా కూడా అంతగా అలరించలేకపోయింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్‌తో దేవర చిత్రం చేస్తుంది. కొరటాల దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. దేవర సినిమాతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో పాగా వేయాలనే ఆశతో ఉంది జాన్వీ కపూర్.
దేవర సినిమా ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు బారీగానే ఉన్నాయి.. ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబోలో రూపొందనున్న సినిమా చేయనుంది జాన్వీ కపూర్. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఇందులో జాన్వీ కపూర్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని టాక్. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో జాన్వీ కపూర్ నటిస్తుండడం ప్రాధాన్యత సంతరిచుకుంది. ఇక హనురాఘవపూడి త్వరలో ప్రభాస్‌తో ఓ సినిమా చేయనుండగా, ఇందులో కూడా జాన్వీ కపూర్‌ని కథానాయికగా అనుకుంటున్నారట.
అయితే జాన్వీ కపూర్ సినిమాల కన్నా కూడా తన గ్లామర్ షోతోనే హైలైట్ అవుతుంది. ఎప్పటికప్పుడు తన ఎద అందాలు థైస్ చూపిస్తూ కుర్రాళ్లని కుదురుగా ఉంచనివ్వడం లేదు. జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్స్ కి ప్రతి ఒక్కరు పిచ్చెక్కిపోతున్నారు. తాజాగా జాన్వీ కపూర్ ఓ ఈవెంట్‌కి కురచ దుస్తులలో హాజరు కాగా, ఆ లుక్స్ తో ఫొటో షూట్ కూడా చేసింది. జాన్వీని పొట్టి బ్లాక్ డ్రెస్‌లో చూసేసరికి ప్రతి ఒక్కరు మైమరిచిపోతున్నారు. ఈఅమ్మడి అందాలకి దాసోహం అవుతున్నారు.
View this post on Instagram