Jaiswal| మరి కొద్ది రోజులలో టీ20 వరల్డ్ కప్ మొదలు కానుంది. జూన్ 2 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారీ అంచనాలతో బరిలోకి దిగబోతుంది టీమిండియా. అయితే కొద్ది రోజుల క్రితం వరల్డ్ కప్ కోసం 15 మంది ఆటగాళ్ల జాబితాని విడుదల చేసింది బీసీసీఐ. ఇందులో ఐపీఎల్‌లో అద్భుతంగా ప్రదర్శన కనబరుస్తున్న దానిని బట్టి కొందరిని ఎంపిక చేశారు. అయితే సెలక్షన్ తర్వాత వారి ప్రతిభ మరింత చెత్తగా మారింది. శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రోహిత్ శర్మ ఇలా చాలా మంది ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచడం లేదు. దీంతో టీమిండియా ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది.
అయితే ఇప్పుడు ఐపీఎల్ అన్ని దేశాల ఆటగాళ్లు కలిసి ఆడుతున్న నేపథ్యంలో కొందరి లోపాలని ఇట్టే పసిగట్టేస్తున్నారు. ఈ క్రమంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎక్కువగా ఎడమ చేతి వాటం బౌలర్ల చేతిలోనే అవుట్ అవుతుండడాన్ని అందరు గ్రహించారు. అదే అతని లోపం అంటున్నారు. జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రత్యర్ధి జట్లు లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లతోనే బౌలింగ్ చేయిస్తున్నాయి. ఆ సమయంలో జైస్వాల్ దొరికిపోతున్నాడు కూడా.ఐపీఎల్ 2024లో జైస్వాల్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ల చేతిలో జైస్వాల్ ఏకంగా ఆరు సార్లు అవుటయ్యాడు. గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లోను అలానే ఔటయ్యాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరన్ .. జైస్వాల్ బలహీనతను గ్రహించి.. అవుట్ సైడ్ ది ఆఫ్ సైడ్ బంతులు వేయగా, ఆ ఓవర్‌లోని నాలుగో బంతికి ఔటయ్యాడు. అతని బలహీనతని గ్రహించి ఇట్టే ఔట్ చేస్తున్నారు. దీనిని ఓవర్ కమ్ చేయకపోతే వరల్డ్ కప్‌లో చాలా సమస్య వచ్చే అవకాశం ఉంది. రోహిత్ శర్మతో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్న యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ల చేతిలో ఏకంగా ఆరు సార్లు అవుటు కావడం అందరినిఇ ఆశ్చర్యపరచింది.. లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఈ సీజన్‌లో అతనికి 72 బంతులు వేయగా, అందులో 16 సగటుతో 99 పరుగులు సాధించాడు. 29 డాట్ బాల్స్ ఉన్నాయి. వీలైనంత త్వరగా జైస్వాల్ ఈ సమస్యని అధిగమించాల్సి ఉంటుంది.