Thursday, April 3, 2025
HomeAndhra PradeshJanasena Star Campaigners | జనసేన పార్టీ స్టార్‌ క్యాంపెనర్స్‌ లిస్ట్‌ ఇదే..! పవన్‌ కల్యాణ్‌కు...

Janasena Star Campaigners | జనసేన పార్టీ స్టార్‌ క్యాంపెనర్స్‌ లిస్ట్‌ ఇదే..! పవన్‌ కల్యాణ్‌కు జబర్దస్త్‌ కమెడియన్స్‌ సపోర్ట్‌..!

Janasena Star Campaigners | ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమరం కొనసాగుతున్నది. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాన్‌ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ పార్టీలతో కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన పార్టీ నుంచి మరో 20 మంది అభ్యర్థులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక జనసేన పార్టీ తరఫున స్టార్‌ క్యాంపెయినర్స్‌ జాబితాను పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీ టీవీ నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, పృథ్వి, జబర్దస్త్ హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెనర్లుగా వ్యవహరిస్తారని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ పేరిట అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

హైపర్‌ ఆదితో పాటు పలువురు జబర్దస్త్‌ కమెడియన్స్‌ గత ఎన్నికల సమయంలోనూ పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా సైతం పవన్‌ కల్యాణ్‌కు ఆది మద్దతుగా నిలుస్తుంటాడు. గత ఎన్నికల్లో జనసేన తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన హైపర్ ఆది.. తాజాగా ఎన్నికల ప్రచారంలోనూ సందడి చేయనున్నాడు. ఇంతకు ముందు జనసేన పార్టీ నిర్వహించిన పలు సభల్లో తన స్పీచ్‌తో జనసేన కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపిన ఆది.. అధికార వైసీపీ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఈ సారి ఎన్నికల్లో జనసేనాని అసెంబ్లీకి పంపేందుకు నటీనటులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేసన్‌ వెలువడనున్నది. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 25 కాగా.. ఓటింగ్ మే 13న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4 వెలువడనున్నాయి.

 

RELATED ARTICLES

తాజా వార్తలు