Janhvi Kapoor| అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒక్క పెద్ద హిట్ కొట్టకపోయిన కూడా ఆమెకి స్టార్ హీరోయిన్స్‌లని మించిన ఫాలోయింగ్ ఉంది. 2018లో వచ్చిన ధడక్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. ఇందులో ఏ సినిమా కూడా జాన్వీకి పెద్ద హిట్ అందించలేకపోయాయి. అయితే జాన్వీ కపూర్ మాత్రం తన అందాలని నమ్ముకొని క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేసుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటుంది. . చీర కట్టిన, స్కర్ట్ వేసిన జాన్వీ అందాలు కుర్రాళ్లలో గిలిగింతలు పెట్టిస్తుంటాయి.
దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమా అవకాశాలు అందుకుంటుంది. ఇక వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసం కూడా కొంత సమయం కేటాయిస్తూ చాలా బిజీగా మారింది. జాన్వీ కపూర్ బయట కనిపించిందంటే చాలు కెమెరాలన్నీ కూడా ఆమెని ఫాలో అవుతూ ఉంటాయి. ఇక ఈ అమ్మడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో రిలేషన్‌లో ఉన్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కుదిరినప్పుడల్లా తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక వారు తిరుపతిలో పెళ్లి చేసుకుంటారనే ప్రచారం ఒకటి అప్పట్లో గట్టిగా నడిచింది
బంగారు పూతతో ఉండే తన తల్లి చీరెను కట్టుకొని జాన్వీ కపూర్ తిరుపతిలో పెళ్లి చేసుకోనుందని కూడా అన్నారు. తాజాగా ఓ నెటిజన్ జాన్వీ కపూర్- శిఖర్ ఇద్దరు కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ..త్వరలో వారిద్దరు తిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కామెంట్ పెట్టాడు. ఇది జాన్వీ దృష్టిన పడడంతో కుచ్ బీ అంటూ సమాధానం ఇచ్చింది. అంటే నా పెళ్లి గురించి నాకే తొందర లేదు.ఎవరికి నచ్చినట్టు ఏదేదో రాస్తారు. వీళ్లకు ఎలాంటి వార్తలు రాయాలో.. వారికి ఎక్కడి నుంచి ఇలాంటి సమాచారం లభిస్తుందో తెలియదు అన్నట్టుగా జాన్వీ రాసుకొచ్చింది. జాన్వీ సమాధానంతో ఇప్పట్లో ఈ అమ్మడు పెళ్లి చేసుకోదని
అర్ధమైంది.