Thursday, April 3, 2025
HomeCinemaJanhvi Kapoor | ‘మహీ’ కోసం గాయాలను లెక్క చేయకుండా.. నెట్స్‌లో శ్రమించిన జాన్వీ కపూర్‌

Janhvi Kapoor | ‘మహీ’ కోసం గాయాలను లెక్క చేయకుండా.. నెట్స్‌లో శ్రమించిన జాన్వీ కపూర్‌

Janhvi Kapoor | అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నది. జాన్వీ కపూర్‌ క్రికెట్‌ బ్యాట్‌ పట్టి.. షాట్లు ఎలా ఆడాలో కఠోర సాధన చేసింది. రాబోయే చిత్రం మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మమీ చిత్రంలో క్రికెటర్‌ పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రలో నటించేందుకు క్రికెట్‌ను సాధన చేసింది. ఈ క్రమంలో గాయాలపాలైన లెక్క చేయకుండా శిక్షణను తీసుకున్నది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘150కిపైగా రోజుల శిక్షణ, 30 రోజులకుపైగా షూటింగ్, రెండు గాయాలు, ఒక చిత్రం’ అంటూ వీడియో క్యాప్షన్‌ పెట్టింది జాన్వీ.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

ఈ మూవీ ఈ నెల 31న విడుదల కానున్నట్లు పేర్కొంది. జాన్వీ పోస్ట్‌ చేసిన వీడియోలు నెట్స్‌లో బ్యాట్‌ పట్టి ముమ్మరంగా ప్రాక్టీస చేయడం కనిపించింది. ఈ వీడియోను చూసిన ఆమె బాయ్ ఫ్రెండ్ షికర్ పహారియా సైతం ఇన్‌స్టా వేదికగా స్పందించాడు. ‘బెస్ట్ ఆఫ్ ద బెస్ట్’ అని కామెంట్‌ చేశాడు. జాన్వీ ఫిట్‌నెస్ కోచ్ నమ్రతా పురోహిత్ స్పందిస్తూ ‘ఈ సినిమా కోసం నువ్వు ఎంతగా కష్టపడ్డావో తెలుసు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ పోస్ట్‌ చేసింది. ఈ మూవీలో రాజ్‌కుమార్‌ రావుతో జాన్వీ జతకట్టింది. ఇందులో మహిమ పాత్ర పోషించింది.

మరోవైపు ఈ చిత్ర బృందం ఇటీవలే యూట్యూబ్‌లో ఓ బీటీఎస్ వీడియోను షేర్ చేసింది. జాన్వీ కపూర్‌కు క్రికెట్ శిక్షణ సందర్భంగా ఎదురైన సవాళ్లను దర్శకుడు శరణ్ శర్మ వివరించాడు. జాన్వీ క్రికెట్ కోచ్ అభిషేక్ నాయర్ సైతం అనుభవాలను వివరించాడు. బరోడా క్యాంప్‌లో జాన్వీ శిక్షణ పొందినట్లు తెలిపాడు. ఐపీఎల్‌కు సిద్ధమయ్యే క్రికెటర్లు ఏ స్థాయిలో శిక్షణ పొందుతారో జాన్వీ కపూర్ కూడా అలాగే కఠోర సాధన చేసిందని ప్రశంసించాడు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు