Janhvu Kapoor| అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందంతో ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. జాన్వీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. కేక పెట్టించాలతో కుర్రాళ్లకి కంటిపై నిద్రలేకుండా చేస్తుంటుంది. జాన్వీ షేర్ చేసిన పిక్స్ క్షణాలలో వైరల్ అవుతుంటాయి. సినిమాల కన్నా కూడా తన గ్లామర్ షోతోనే జాన్వీకి ఎక్కువ క్రేజ్ దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ని దున్నేయాలనే ఆలోచనో ఉంది జాన్వీ. సౌత్‌లో జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీ చేస్తుంది. ఈ మూవీతోనే టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది.
ఇక త్వరలో రామ్ చరణ్ సినిమాలో కూడా నటించబోతోంది.ఈ సినిమాని బుచ్చిబాబు పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించబోతున్నారు. అయితే జాన్వీ కపూర్ తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో జాన్వీకి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పగలరా? అని అడగడంతో జాన్వీ కపూర్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. తన కలలను ఆయన కలలుగా భావించేవాడు కావాలని, ఎప్పుడూ అండగా నిలవాలని, ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇవ్వాలని, ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలని, తాను ఏడ్చినప్పుడు కూడా తన పక్కన ఉండి ధైర్యం చెప్పేవాడు కావాలంటూ పెద్ద లిస్టే చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే ఇంటర్వ్యూలో జాన్వీ సంచలన విషయం కూడా వెల్లడించింది. తాను 13 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు కొందరు ఆకతాయిలు జాన్వీ ఫొటోలని పోర్న్ సైట్‌లో పెట్టారట. శ్రీదేవి కూతురు అంటూ పరమ అసహ్యంగా వైరల్ చేయడంతో నా స్కూల్‌లో నాకు విచిత్ర అనుభవం ఎదురైంది. చాలా అవహేళనగా మాట్లాడారు. ఆ సమయంలో నాకు వాటిపై అవగాహన కూడా లేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్ధం అయ్యేది కాదు. బాడీ షేమింగ్ చేసిన, విమర్శలు చేసిన కూడా అన్నింటిని తట్టుకొని నిలబడ్డాను అని జాన్వీ పేర్కొంది.