Wednesday, April 2, 2025
HomeTelanganaJanwada | కొండంత రాగం తీసి.. పాట పాడినట్టు..!

Janwada | కొండంత రాగం తీసి.. పాట పాడినట్టు..!

Janapadham_EPaper_TS_28-10-2024

కొండంత రాగం తీసి…
…….. పాట పాడినట్టు…!

జన్వాడలో రేవంత్ సర్కార్ అత్యుత్సాహం..
ఇంట్లో దవాత్ కు రేవ్ పార్టీ అంటూ మరలంటించే యత్నం..
రోజంతా పోలీసుల హంగామా…
గంటగంటకు మారిన రిపోర్టులు…
అత్యుత్సాహం ప్రదర్శించిన మీడియా..
సాయంత్రానికి ఏమీ లేదని తేల్చిన పోలీసులు..

కొండంత రాగం తీసి.. దిక్కుమాలిన పాటపాడినట్టు రేవంత్ సర్కార్ యవ్వారం. జన్వాడలో ఏదో అయినట్టు.., మరేదో జరుగుతున్నట్టు., దానితో దేశానికి ఏదో ఉపద్రవం కలుగబోతున్నదా అన్నట్టు అటు పోలీసులు., వారికి తగ్గట్టు ఇటు మీడియా రోజంతా హడావుడి చేసి నవ్వులపాలయ్యాయి. కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో జరుపుకున్న ఓ దావత్ ను ‘జీర్ణించుకోలేక’ కాంగ్రెస్ సర్కార్ డ్రాగ్స్ అని, దందా అని ఏవేవో పేర్లు పెట్టి అక్కసునంతా వెల్ల‘కక్కింది’. కేవలం కేటీఆర్ టార్గెట్ గా జరిగిన పని తప్ప అందులో విషయమేమి లేదని చాటి తన పరువును తానే తీసుకుంది. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక దొంగదెబ్బ తీయాలని భావించి ఇదంతా చేసిందని అంతా తెలిసేలా చేసి మరిన్ని మరకలంటించుకుంది. గంటగంటకు రిపోర్టులు మారుస్తూ.., మీడియాకు లీకులిస్తూ.., ఇంకా ఏదో బయటపెడతామని బిల్డప్ లు చూపే ప్రయత్నంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన మహా అద్భుత కార్యమే తప్ప మరేమీ లేదని స్పష్టంగా రుజువు చేసింది.

=======================

జనపదం, బ్యూరో

ఏదో చేద్దామనుకున్నారో.., లేదంటే నిజంగానే పక్షపాతం లేకుండానే ముందుకెళ్లారోగానీ బొక్కబోర్లపడ్డారు. ప్రతిపక్షాన్ని తొక్కేందుకు అన్ని మార్గాలను వెతుక్కుంటూ ఏ మార్గంలో వెళ్లినా తీవ్ర అవమానాల పాలవుతున్నారు. రేవంత్ సర్కార్ తీరు కేవలం పాలన పక్కన పెట్టి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ టార్గెట్ ముందుకెళ్తుందన్న చేదు నిజాన్ని ఒక్కొక్కటిగా ఫెయిల్యూర్ అవుతున్న ఘటనలే రూడీ చేస్తున్నాయి. హామీలపై ప్రశ్నిస్తున్నందుకు ప్రతీకారమో.., ఆ ప్రభుత్వంలో జరిగిన చర్యకు ప్రతిచర్యోగానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వదిలేసి రివేంజ్ పాలిటిక్స్ కే పెద్దపీట వేస్తున్నది. అందుకు మచ్చు తునకే గతంలో హైడ్రా కూల్చివేతల పేరుతో చేసిన హడావుడి ప్రధానమైనదైతే.., నేడు రేవ్ పార్టీ పేరుతో విరుచుకుపడిన తీరు అతి ప్రధానమైనది.

జన్వాడలో రేవంత్ సర్కార్ అత్యుత్సాహం..
కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ జన్వాడలో రేవంత్ సర్కార్ అతి భారీ ఉత్సాహాని ప్రదర్శించినట్టు రోజంతా జరిగిన ఘటనలు చూస్తే తెలిసిపోతున్నది. కేవలం ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి వెనకాల ఉన్న పార్టీని ఢీకొట్టే సత్తా లేకనే ఇంత నీచానికి దిగజారిన తీరు బాధాకరం. సమస్యను సమస్యగా చూడాల్సిన తీరును మాని, కేవలం చిన్న సమస్యనైనా తనకు బదులుకు పనికొచ్చే అవకాశంగా భావించిన కుట్ర అత్యంత విషాదకరం. జన్వాడలోని రాజ్ పాకాల ఇంట్లోనే తన అనుకున్నవారితో చేసుకుంటున్న పార్టీని వక్రీకరించి బదునాం చేసేందుకు హస్తం సర్కార్ పడిన శ్రమ సాయంత్రానికి బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఇంట్లో పర్సనల్ గా జరుపుకునే దావత్ ను పబ్లిసిటీ చేసి అబాసుపాలైంది. అంతా ఒక్కదగ్గర చేరి జరుపుకుంటున్న ఆనంద సమయాన్ని చూడలేక కళ్లుకుట్టి చెరిచిన తీరు విమర్శకులను సైతం విస్మయానికి గురి చేసింది.

రోజంతా పోలీసుల హంగామా…
పోలీసులు జన్వాడ ఫామ్ హౌజ్ వద్ద నానా హంగామా క్రియేట్ చేశారు. శనివారం రాత్రి పలువురు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రక్షకభటులు ఆదివారం ఉదయం నుంచి తమ పని వేగాన్ని పెంచారు. ఘడియఘడియకు ఓ కొత్త క్లూన్ బయటకు వదులుతున్నట్టుగా నటిస్తూ మీడియా సాక్షిగా ఎన్నో అనుమానాలకు బీజం చేశారు. ప్రతిపక్షనేత, అందునా అధికారంలో ఉన్నప్పుడు వారి ద్వారా పొందిన పలు పరాభవాలకు ఇన్నాళ్లకు గట్టిగా తిప్పికొట్టే సమయం చిక్కిందని భావించి పలువురు అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ లో ఏదో జరుగుతున్నది అని విషయాన్ని విరిచుకుంటూ చెప్పిన సందర్భాలు వారి అతిని తెలియజేస్తున్నాయి. అదీకాకుండా ఉదయం ఎక్సైజ్ కేసుగా నమోదైన క్రైమ్ సాయంత్రానికి డ్రాగ్స్ కేసుగా మారడం కూడా కొందరు ఉన్నతాధికారుల ‘ప్రత్యేక’ ఇంట్రెస్ట్ గా భావించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెప్పిన విషయం కూడా వారి ద్వంద్వ విధానాలను కళ్లకు కట్టింది.

అత్యుత్సాహం ప్రదర్శించిన మీడియా..
శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు జన్వాడ రాజ్ పాకాల ఫామ్ హౌస్ వేదికగా పోలీసులు జరిపిన హంగామా ఒక రకంగా నవ్వు తెప్పించింది. బ్రేకింగ్ లు., టీఆర్పీ రేటింగ్ ల కోసం పలు మీడియా సంస్థలు పడరాని పాట్లు పడ్డాయి. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా చేస్తుందో అంతకు మించిన వికృత ఆనందంతో పోటీపడి, రుచి వంటను వండి వడ్డిస్తూ జనాలను అనుమానం అనే మీమాంసలో రోజంతా ఉక్కిరి బిక్కిరి చేశాయి. లోపలి నుంచి ఒక్క చిన్న మాట బయటకు పొక్కితే దానికి పదిరెట్ల మసాలాలు దట్టించి సగటు టీవీ వీక్షకుడు ఐతారం వేళ వదిలి వెళ్లకుండా బంధించి కూర్చునేలా చేశాయి. సాయంత్రానికి పోలీసులే జరిగింది ఇది.., పొద్దటి నుంచి మీరు, మేం చేసింది., చూపిందంతా ట్రాష్ అనే ధోరణిలో విడుదల చేసిన ఫైనల్ స్టేట్ మెంట్ తో రోజంతా మీడియా అతి దూకుడు ఎంత చిల్లరగా జరిగిందో చెప్పకనే చెప్పింది. మొత్తంగా కేటీఆర్ అంటే ద్వేషంతో ఉన్న రేవంత్ సర్కార్ ప్రతికారేచ్ఛతో రగిలిపోతూ అవకాశం చిక్కితే చాలు అన్నీ విప్పి నిలబెట్టాలనే కసితో ఉందని మరోమారు నిరూపించుకుంది. అదే సమయంలో తాను చేసిన అతితో అందరిలో నవ్వులపాలైంది అని కూడా రూడీ చేసుకుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు