గాయకుడు జయరాజ్ కు గుండెపోటు
ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను HYD నిమ్స్ ఆస్పత్రిలో చేర్చించారు. ఐసీయూలో డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. జయరాజ్ ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ‘అడవిలో అన్న’ సినిమాలోని “వందనాలమ్మ” పాటను రాసింది జయరాజే. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ఈ పాట అప్పట్లో ఎంతోమందిని చైతన్య పరిచింది.