Sunday, December 29, 2024
HomeSportsJio Cinema|ఐపీఎల్‌తో జియో క్రియేట్ చేసిన స‌రికొత్త రికార్డ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వ‌చ్చాయంటే..!

Jio Cinema|ఐపీఎల్‌తో జియో క్రియేట్ చేసిన స‌రికొత్త రికార్డ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వ‌చ్చాయంటే..!

Jio Cinema| ఇటీవ‌ల ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 ముగిసింది. హోరాహోరీగా సాగుతూ వ‌చ్చిన మ్యాచ్‌లు ప్రేక్ష‌కుల‌కి మంచి థ్రిల్ క‌లిగించాయి. ఇక ఫినాలేకి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేరుకోగా, వారి మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర ఫైట్‌లో కేకేఆర్ విజ‌యం సాధించి కప్ ఎగ‌రేసుకుపోయింది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‌తో ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు చెందిన జియోసినిమా స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు 2600 కోట్ల వ్యూస్‌తో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

గత ఏడాది ఐపీఎల్ క్యాంపెయిన్‌తో పోలిస్తే.. ఈ ఏడాదిలో 53శాతం వృద్ధిని జియోసినిమా సాధించింది. ఐపీఎల్ టోర్నమెంట్ అధికారిక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ 35వేల కోట్ల నిమిషాల వాచ్-టైమ్ నమోదు చేసింది. ఐపీఎల్ ఆరంభం తర్వాత జియోసినిమా వ్యూస్ 38శాతానికి చేరిందంటే ఐపీఎల్ ఇంపాక్ట్ ఎంత ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. జియో సినిమా 62 కోట్ల కన్నా ఎక్కువ వ్యూస్‌‌తో ఐపీఎల్ 2024ని ముగించింది. జియోసినిమా బ్రాండ్ స్పాట్‌లైట్ ప్లాట్‌ఫారమ్ ఆరు ప్రముఖ యూజర్ బ్రాండ్‌ల సాయంతో ప్రారంభ మ్యాచ్‌కు లైవ్ స్ట్రీమింగ్ అందించ‌గా . అందులో డ్రీమ్11, థమ్స్ అప్, పార్లే ప్రొడక్టులు, బ్రిటానియా, దల్మియా సిమెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి.

బ్రాండ్ స్పాట్‌లైట్.. సీజన్ ముగిసే సమయానికి జియోసినిమా 28 మంది స్పాన్సర్‌లను 1400 కన్నా ఎక్కువ అడ్వటైజర్లను పొందింది. ఐపీఎల్ 2024 మొదటి రోజున జియోసినిమా 11.3 కోట్ల మంది వీక్షకులతో రికార్డ్ స్థాయిలో సీజన్‌ను ప్రారంభించ‌డం విశేషం. మార్చి 22న సీఎస్‌కే, బెంగళూరు మ్యాచ్‌డే సందర్భంగా ప్లాట్‌ఫారమ్‌పై వ్యూస్ 660 కోట్ల నిమిషాల వాచ్ టైమ్ కనిపించింది. అందులో 12 లాంగ్వేజీ ఫీడ్‌లు, 4K వ్యూ, మల్టీ-క్యామ్ వ్యూస్,స్టేడియం వంటి ఎక్స్‌పీరియన్స్ అందించింది. టీవీ ప్రేక్షకులు AR/VR, 360-డిగ్రీల వ్యూతో గత సీజన్‌లో 60 నిమిషాలు వీక్షించగా.. ఈ ఏడాదిలో అంతకన్నా ఎక్కువ సమయం గడిపిన సగటు సమయం 75 నిమిషాలకు చేరుకుందని జియోసినిమానే అధికారికంగా ప్ర‌క‌టించింది.

RELATED ARTICLES

తాజా వార్తలు