JIO Offers | రిలయన్స్ జియో యూజర్లకు మరో సూపర్ ప్యాకేజీని ప్రకటించింది. జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది. రూ.888తో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను జియో లాంచ్ చేసింది. కొత్త యూజర్లతో పాటు ప్రస్తుత జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్లు ఈ కొత్త ప్లాన్‌కు మారవచ్చని కంపెని వెల్లడించింది. ఈ ప్లాన్‌లో యూజర్లకు 30 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా లభించనున్నది. అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా, బేసిక్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ తదితర 15 ఓటీటీ యాప్స్ చూడొచ్చు. దాంతో పాటు అదనంగా 800 డిజిటల్ టీవీ ఛానెల్స్ చూడొచ్చు. ఐపీఎల్ ధన్‌ధనా ఆఫర్ సైతం ఈ ప్లాన్‌లో వర్తిస్తుంది. 50 రోజులపాటు జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ కస్టమర్లు ఉచితంగా ఈ సేవలు సైతం పొందవచ్చు. ఈ ఆఫర్ మే 31తో ముగియనున్నది.