Sunday, December 29, 2024
HomeBusinessJio Cinema | రూ.29కే జియో సినిమా స‌బ్‌స్క్రిప్ష‌న్‌.. 4కే క్వాలిటీతో వీడియోలు

Jio Cinema | రూ.29కే జియో సినిమా స‌బ్‌స్క్రిప్ష‌న్‌.. 4కే క్వాలిటీతో వీడియోలు

ముంబై: ఇప్ప‌టికే టెలికాం రంగంలో ఆధిప‌త్యం చెలాయిస్తున్న జియో.. ఇప్పుడు వీడియో స్ట్రీమింగ్‌ రంగంపై పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్న‌ది. జియో సినిమా పేరుతో ఇప్ప‌టికే ఓటీటీ ల‌వ‌ర్స్‌కు చేరువైన సంస్థ‌.. తాజాగా అందుబాటు ధరలో రెండు కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను ప్ర‌క‌టించింది. పాత ప్లాన్లలోని అధిక ధర, వీడియోలో నాణ్యతలేమి, డివైజ్‌ల సంఖ్య వంటి పరిమితులను తాజాగా అధిగమించింది. కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్ల‌లో రూ.29, రూ.89 ఉన్నాయి. కేవ‌లం రూ.29తో నెల మొత్తం వీక్షించేలా ఆఫ‌ర్‌ను తీసుకువ‌చ్చింది. అయితే ఈ ఆఫ‌ర్ ఒక్క డివైస్‌కు మాత్రమే వ‌ర్తిస్తుంది. నాలుగు డివైస్‌లు కావ‌లంటే మాత్రం రూ.89 ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. అత్య‌ధిక వీడియో క్వాలిటీ, ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఉండటం ఈ ప్లాన్స్ ప్రత్యేకత.

నెల‌కు రూ.29..

ఈ ప్లాన్‌లో భాగంగా నెలకు రూ.29 చెల్లిస్తే ఒక డివైజ్‌లో ఎలాంటి యాడ్స్‌ లేకుండా కంటెంట్‌ను చూడొచ్చు. అదికూడా 4కే వీడియో క్వాలిటీతో. పైగా డౌన్‌లోడ్‌ చేసుకొని ఆఫ్‌లైన్‌లోనూ కంటెంట్‌ను చూసే అవ‌కాశం క‌ల్పించింది. సినిమాలు, హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్లు, పిల్లల షోలు, టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను స్మార్ట్‌ టీవీ సహా ఏ డివైజ్‌లోనైనా వీక్షించే అవకాశం ఉంటుంది. లైవ్‌ టెలికాస్ట్‌లు, స్పోర్ట్స్‌ మాత్రం యాడ్స్‌తో వస్తాయి.

రూ.89 రీచార్జ్‌తో..

ఇది ఫ్యామిలీ ప్లాన్‌. కుటుంబాల‌కు చేరువ‌కావ‌డంలో భాగంగా ఈ రూ. 89 ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. గ‌తంలో నెలకు రూ.149గా ఉన్న ఈ ప్లాన్‌ను ఇప్పుడు రూ.89కి తగ్గించారు. ఇప్పటికే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ చేసుకున్నవారు.. ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవుతారు. ఇది ఒకసారి రీఛార్జ్‌ చేస్తే నెల మొత్తం 4 డివైజుల్లో కంటెంట్‌ను వీక్షించొచ్చు. రూ.29 ప్లాన్‌లో ఉన్న అన్ని ఫీచర్లు దీనికి కూడా వర్తిస్తాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్‌ను యాడ్స్‌తో ఉచితంగానే వీక్షించొచ్చు.

జియోసినిమా ప్రీమియంను సబ్‌స్క్రైబ్ చేసుకున్న‌వారు ఇంటర్నేషనల్‌ కంటెంట్‌ను స్థానిక భాషల్లోనే ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌, హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ వంటి ప్రముఖ సిరీస్‌లు సహా పీకాక్‌, హెచ్‌బీఓ, ప్యారామౌంట్‌, వార్నర్‌ బ్రదర్స్‌, డిస్కవరీ వంటి ప్రధాన స్టూడియోలు నిర్మించిన చిత్రాల‌ను ఎంచ‌క్కా చూడొచ్చు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం..!

RELATED ARTICLES

తాజా వార్తలు