హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. టైటానిక్, అవతార్ యూనివర్సల్ బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన జోన్ లాండౌ (63) కన్నుముశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో హాలీవుడ్ షాక్‌కు గురైంది.
దర్శకుడు కామెరూన్ తో కలిసి ప్రస్తుతం అవతార్ సినిమాల ఫ్రాంఛైజీ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో అవతార్ 4 చిత్రాలతో కలిపి 8 సినిమాలను నిర్మించగా రెండు సినిమాలకు సహాయ నిర్మాతగా వ్యవహరించారు. జోన్ లాండౌకు భార్య, ఇద్దరు పిల్లు ఉన్నారు.
1980లో ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసిన జోన్ లాండౌ దర్శకుడు కామెరూన్ తో కలిసి టైటానిక్ చిత్రాన్ని నిర్మించగా విశ్వ వ్యాప్తంగా చరిత్రలో ఎన్నటికీ నిలిచిపోయే రికార్డులను, గుర్తింపును తీసుకు వచ్చింది. అంతేగాక 14 ఆస్కార్స్ నామినేషన్స్ రాగా 11 అవార్డులు గెలుచుకుని హాలీవుడ్ సినిమా చరిత్రను తిరగరాసింది.
తర్వాత వచ్చిన, వస్తున్న అవతార్ చిత్రం సరికొత్త రికార్డులు తిరగ రాస్తుంది. జోన్ లాండౌ చివరగా నిర్మించిన అవతార్ సిరీస్‌లో 3వ భాగం 2026లో, 4వ భాగం 2030లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.