Friday, April 4, 2025
HomeEducationJournalist Arrest: జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించిన పలువురు నేతలు 

Journalist Arrest: జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించిన పలువురు నేతలు 

హరీష్ రావు

ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

కేటీఆర్

ఉస్మానియాలో పోలీసులు అరెస్ట్ చేసిన జీ న్యూస్ జర్నలిస్ట్ ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛను హరిస్తే సహించేది లేదంటూ ప్రభుత్వానికి హెచ్చరిక రాష్ట్రంలో జర్నలిస్ట్ లపై పోలీసులు వ్యవహారిస్తున్న తీరును భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాపాలనలో జర్నలిస్ట్ లకు కూడా రక్షణ లేదా అని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా ఓయూ లో డీఎస్సీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనను కవర్ చేస్తున్న జీన్యూస్ రిపోర్టర్, కెమెరామెన్ లను అక్రమంగా అరెస్ట్ చేయటం దారుణమని మండిపడ్డారు. జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా ? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే తప్పా అని ప్రశ్నించారు.

నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన… ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీన్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్ట్. ఇందిరమ్మ రాజ్యమంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమేనా అని కేటీఆర్ నిలదీశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియాలో మళ్లీ ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు, అడగడుగునా దర్శనమివ్వటం చూస్తుంటే విద్యార్థులు మరో ఉద్యమంతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పటం ఖాయమన్నారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్ట్, కెమెరా మెన్ లను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే సహించే ప్రసక్తే లేదన్నారు. జర్నలిస్టులపై పోలీసుల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ జర్నలిస్ట్ యూనియన్లు చేసే పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్

విద్యార్థులపై బిఆర్ఎస్వీ నాయకుల పై దాడి చేసిన పోలీసు లను వేంటనే సస్పెండ్ చేసి సర్వీస్ నుండి
తొలగించాలని డిమాండ్ చెస్తున్నం డీఎస్సీ వాయిదా వేసి 25వేల పోస్టులను భర్తీ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ లో శాంతియుతంగా నిరసన చెస్తున్న అభ్యర్థులను,బిఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్య .. అరెస్టు చేసిన విద్యార్థులను , బిఆర్ఎస్వీ నాయకులు వేంటనే విడుదల చేయాలి..

డా. ఎర్రోళ్ల శ్రీనివాస్.

డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా? మాది కంచెల ప్రభుత్వం కాదు, ఆంక్షల ప్రభుత్వం కాదని చెప్పిన కాంగ్రెస్ నాయకులు జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్నారు.

గత రెండు మూడు రోజులుగా బాష్ప వాయువులతో, పోలీస్ పాహారాలో ఉస్మానియా యూనివర్సిటీ మళ్లీ సమైక్య రాష్ట్రాన్ని తలపిస్తుంది.

అరెస్టు చేసిన జర్నలిస్టులను, విద్యార్థులను, నిరుద్యోగులను మరియు విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలి. లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి బి.ఆర్.ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటూ వారి తరపున పోరాటం చేస్తుంది. జర్నలిస్టులపై పోలీసుల దమనకాండను ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

జర్నలిస్టులపై దాడులు హేయం

తెలంగాణలో అప్రకటిత నిర్భంధం సాగుతుంది ప్రజా పాలన కాదు ఇది ప్రజాస్వామ్యానికి తలవంపుల పాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంతటి నిర్భంధం లేదు మొన్న టీవీ 9 జర్నలిస్ట్, నిన్న మహిళా జర్నలిస్టు, నేడు జీటీవీ జర్నలిస్టులతో పోలీసుల ప్రవర్తన గర్హనీయం నిరుద్యోగుల గొంతు నొక్కాలనుకునే కుటిల యత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం విడనాడాలి ..వారి న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలి అధికారం కోసం నిరుద్యోగులను వాడుకుని .. అధికారం వచ్చాక నిరుద్యోగులను అణగదొక్కుతున్నారు కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు జర్నలిస్టులపై పోలీసుల దమనకాండను ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు జర్నలిస్టుల పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా మీడియా స్వేచ్ఛను హరించడం హేయనీయంమహిళా జర్నలిస్టు పట్ల అమానవీయంగా వ్యవరించిన పోలీసుల పట్ల వెంటనే చర్యలు తీసుకోవాలి

ప్రశాంత్ రెడ్డి

జర్నలిస్టుల పై జరుగుతున్న వరుస దాడులపై మాజి మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటీవల సిఎం ఇంటి ముందు,మొన్న గాంధీ హాస్పిటల్ లో,నిన్న బల్కంపేట,ఇవాళ ఓయు లో జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అక్షేపనీయమని అన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా ప్రతిపక్షం వెళ్తే అరెస్టులు,నిర్బంధాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..నిరుద్యోగుల నిరసన కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టుల పట్ల పోలీసులను అడ్డుపెట్టుకొని కర్కశంగా వ్యవహరించడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. కంచెలను బద్దలు కొట్టామని,ప్రజాపాలన అని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసులు వేస్తున్న కంచెలు,నిర్బంధాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

బల్కంపేట ఎల్లమ్మ అమ్మ వారి కళ్యాణ మహోత్సవం కవరేజీ కి వెళ్లిన మహిళా జర్నలిస్టు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని,వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజి మంత్రి,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులపై పోలీసు దాడులు చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే పంథాలో జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

బాల్క సుమన్, పల్లె రవికుమార్, రామచంద్ర నాయక్, తుంగ బాలు 
….రాష్ట్రం లో ప్రజా పాలన కాదు అన్ని వర్గాల దగా పాలన నడుస్తోంది
..సంక్షేమ హాస్టళ్లు ,యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తం అయింది
..హాస్టళ్ల లో ఫుడ్ పాయిజన్ సాధారణ విషయం గా మారింది
..చట్నీల్లో ఎలుకలు ,అన్నం లో బల్లులు వస్తున్నాయి
..యూనివర్సిటీ ల్లో 2014 కు ముందు నాటి పరిస్థితులు నెలకొన్నాయి
..యూనివర్సిటీలకు పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ల ను నియమించలేదు
..నిరుద్యోగుల పై దమన కాండ నడుస్తోంది
…యూనివర్సిటీ హాస్టళ్లల్లో కరెంటు కూడా తీసేస్తున్నారు
…రేవంత్ పాలనలో సామాజిక న్యాయం కొరవడింది
…మైక్ దొరికితే చాలు రేవంత్ తాము సామాజిక న్యాయం పాటిస్తున్నాం అంటున్నారు
..ఎస్సీ ,బీసీ మంత్రులకు అధికారులకు అడుగడుగునా అవమానం జరుగుతోంది
..యాదాద్రి గుడిలో భట్టికి అవమానం జరిగింది ..నిన్న బల్కం పేట ఎల్లమ్మ గుడిలో పొన్నం ప్రభాకర్ కు అవమానం జరిగింది
..దళిత ఎస్ ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారు
..రేవంత్ పాలనలో మాటల్లో తప్ప చేతల్లో సామాజిక న్యాయం లేదు
…కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం లో సామాజిక న్యాయం లేదు
..రేవంత్ రెడ్డి అందర్నీ బెదిరించే ధోరణి లో మాట్లాడుతున్నారు
…నిన్న మహబూబ్ నగర్ లో నిరుద్యోగులను అవమాన పరిచేలా సీఎం మాట్లాడిన తీరు ను ఖండిస్తున్నాం
..రేవంత్ అందరి గొంతులు నొక్కుతున్నారు
…జర్నలిస్టులకు ప్రతి రోజూ పోలీసుల చేతి లో అవమానాలు జరుగుతున్నాయి
..హోం మంత్రిగా రేవంత్ ఉన్నారు ..పోలీసులను అడ్డం పెట్టుకుని నిరసనలు అణచి వేద్దామనుకుంటున్నారు
…కండువాలు కప్పే తీరిక రేవంత్ కు ఉంది కాని నిరుద్యోగులతో రెండు నిముషాలు మాట్లాడే టైం లేదు
…నిరుద్యోగుల అండతో గద్దె నెక్కిన రేవంత్ ఇపుడు వారిని అణచి వేస్తున్నారు
…ఉస్మానియా యూనివర్సిటీ లో ఓ ఛానల్ ప్రతినిధి పై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నాం
..సమస్యల పై గొంతెత్తుతున్న ప్రతీ వర్గానికి బీ ఆర్ ఎస్ అండగా ఉంటుంది
…కాంగ్రెస్ లో ఎస్సీ ,బీసీ ప్రతినిధులకు గౌరవం లేదు
…కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యే స్వయంగా రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పై సోషల్ మీడియా లో నిరసన స్వరం వినిపించారు
…కొన్ని గంటల్లోనే ఆ ఎమ్మెల్యే పై ఒత్తిడి తెచ్చి సోషల్ మీడియా లో పెట్టిన వ్యాఖ్యలు తీసేయించారు
…రేవంత్ తెస్తానన్న ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన అని ఇపుడు అర్థం అవుతోంది
..రేవంత్ కడప వెళ్లి షర్మిల కోసం ఊరూరు తిరుగుతా అంటున్నారు
..సమైక్య వాదుల కోసం రేవంత్ తాపత్రయ పడుతున్నారు
..చంద్రబాబు వచ్చిన తీరు ..ఉస్మానియా యూనివర్సిటీ లో పోలీసుల దమన కాండ చూస్తుంటే మనం తెలంగాణ లో ఉన్నామా సమైక్య రాష్ట్రం లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది
..రేవంత్ తనకు వచ్చిన అవకాశాన్ని ప్రజలకు మంచి చేయడానికి వాడుకోవాలి
..రేవంత్ పద్ధతి ప్రవర్తన మార్చుకోవాలి
RELATED ARTICLES

తాజా వార్తలు