Wednesday, January 1, 2025
HomeCinemaNTR | ఆ విషయంలో ఎన్టీఆర్‌ పేరుని లాగొద్దు..! స్థల వివాదంపై క్లారిటీ ఇచ్చిన బృందం..!

NTR | ఆ విషయంలో ఎన్టీఆర్‌ పేరుని లాగొద్దు..! స్థల వివాదంపై క్లారిటీ ఇచ్చిన బృందం..!

NTR | టాలీవుడ్‌ అగ్ర నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ స్థల వివాదంలో హైకోర్టును ఆశ్రయించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలపై ఆయన బృందం స్పందించింది. ప్రస్తుతం వార్తల్లో ప్రస్తావించిన ప్లాట్‌ను 2013లోనే విక్రయించారని ఎన్టీఆర్‌ బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ విషయంలో ఎన్టీఆర్‌ పేరు తీసుకురావొద్దని స్పష్టం చేసింది. ఆ వివాదంతో ఎన్టీఆర్‌కు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.75లో ఎన్టీఆర్ 2003లో కొంత స్థలాన్ని ఓ మహిళ నుంచి కొనుగోలు చేశారు. అయితే, ఆ స్థలంలో మహిళ భారీగానే లోన్లు తీసుకున్నది. ఆ విషయాన్ని బహిరంగ పరచకుండా ఎన్టీఆర్‌కు విక్రయించింది. అయితే, తీసుకున్న లోన్లు చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆ స్థలంపై డెబిట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. అయితే, ఆ స్థలంపై హక్కులు బ్యాంకులకే ఉంటాయని ట్రైబ్యుల్‌ స్పష్టం చేసింది. అయితే, ట్రైబ్యునల్ తీర్పును సవాల్ ఎన్టీఆర్ హైకోర్టులో సవాల్‌ చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ బృందం ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేస్తూ వివరణ ఇచ్చింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించామని వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

RELATED ARTICLES

తాజా వార్తలు