Kajal Aggarwal| లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్స్ అందరితో నటించింది. తారక్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్లతో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వంటి సీనియర్లతోనూ నటించి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. 15 ఏళ్ల సినీ కెరీర్‌లో కాజల్‌పై వచ్చిన కాంట్రవర్సీలు చాలా తక్కువ. అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం ఆమెది. ఒకే హీరోతో కాజల్ రెండు మూడు సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ అమ్మడు మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ సరసన ‘మగధీర’ సినిమా చేసింది. ఆ తర్వాత బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మూవీలో.. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆయన రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’లో హీరోయిన్‌గా నటించడం విశేషం.
కాజల్ అగర్వాల్ 2020లో గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని 2022లో తన కొడుకు నీల్‌ను స్వాగతించిన సంగతి తెలిసిందే. అయితే వారసుని జననం తర్వాత చాలా సమస్యలు ఫేస్ చేసింది. కాని వాటన్నింటిని దాటుకుంటూ ముందుకు సాగిన ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్‌లోను అదరగొడుతుంది. ప్రస్తుతం కాజల్ .. కమలహాసన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ఇండియన్2లో ఓ హీరోయిన్‌గా చేస్తోంది. హిందీలో ఉమ అనే చిత్రంతో పాటు నాయికా ప్రాధాన్యం ఉన్న సత్యభామ అనే తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమా మే 31న విడుదల కానుండగా, ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంది. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది.
కొన్నాళ్ల క్రితం ఓ మూవీ షూటింగ్ లో పాల్గొన్న తాను తొలిరోజు షూటింగ్ పూర్తయ్యాక వ్యానిటీ వ్యాన్ లో కూర్చుందట. ఆ సమయంలో ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్.. అనుమతి లేకుండా వ్యానిటీ వ్యాన్ లోకి వచ్చి భయపెట్టించాడని పేర్కొంది. రావడం రావడమే షర్ట్ విప్పి అతని ఛాతీ మీద ఉన్న ఒక టాటూని చూపించాడు. అయితే అతను చూపించింది తన పేరుతో ఉన్న టాటూ అని.. ఆ సమయంలో అతను అలా చేయడంతో భయపడ్డాను. తనపై ఉన్న అభిమానాన్ని టాటూ రూపంలో ప్రదర్శించినందుకు సంతోషంగా ఉన్నా కూడా ఆయన అలా ప్రవర్తించాల్సింది కాదు. అప్పుడు అతనిని హెచ్చరించినట్టు కాజల్ పేర్కొంది. ఇక కాజల్ నటించిన తాజా చిత్రం సత్యభామ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్ లో సత్యభామగా కాజల్ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టనుందని అంటున్నారు.