Kajal| సుడిగాలి సుధీర్‌కి కాజల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అంటే వెంటనే టెన్షన్ పడిపోకండి. స్టోరీ మొత్తం చదివితే అసలు విషయం ఏంటన్నది అర్ధమవుతుంది. బుల్లితెరపై తనదైన హాస్యం పెంచుతూ వెండితెరపై హీరోగా అవతరించాడు సుధీర్. ఆయన హీరోగా చేసిన పలు సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఆహా కోసం సర్కార్ పేరుతో గేమ్ షో చేస్తున్నాడు.ఈ షోకి ప్రదీప్ మాచిరాజు యాంకర్‌గా వ్యవహరించగా, ఇప్పుడు అతడి స్థానంలోకి సుడిగాలి సుధీర్ వచ్చి చేరాడు. కొద్ది రోజల క్రితం సీజన్ 4 మొదలు కాగా, తాజాగా కాజల్ అగర్వాల్ గెస్ట్‌గా వచ్చి సందడి చేసింది.
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించిన సత్యభామ త్వరలో రిలీజ్ కి సిద్ధంగా ఉండగా, ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా నవీన్ చంద్ర, దర్శకుడు సుమన్ చిక్కాలతో కలిసి సర్కారు షోకి హాజరైంది కాజల్. అయితే కాజల్‌ని చూసిన సుడిగాలి సుధీర్.. నేల మీద చూసిన చందమామ అంటూ కవితలు అల్లడం మొదలు పెట్టాడు. కాజల్ చేతిని తాకి, మనది 500 ఏళ్ల నాటి బంధం… అంటూ మగధీర మూవీ థీమ్ ని గుర్తు చేయడంతో అప్పుడు కాజల్ నువ్వు కాళకేయ అంటుంది. దాంతో మనోడు షాక్‌లో ఉండిపోతాడు. ఇక సుడిగాలి సుధీర్, కాజల్ మధ్య జరిగిన పలు ఆసక్తికర సంభాషణలు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాయి.
ఇక ఇక కాజల్‌తన కొడుకు ముద్దాడుతున్న ఫొటోని టీషర్ట్‌పై ప్రదర్శించి అందరి మనసులు దోచుకున్నాడు. ఇక కాజల్‌ని పలు ప్రశ్నలు అడిగిన సుధీర్..మీరు సత్యభామలో ఏ రోల్ ప్లే చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి ఏసీపీ అని కాజల్ చెబుతుంది. ఇక ఇంట్లో మీరు సత్యభామనా అని అడగగా, దానికి కొడుకు నీల్ విషయంలో తాను చందమామను. భర్త గౌతమ్ విషయంలో మాత్రం సత్యభామను అంటూ అదిరిపోయే సమాధానం చెప్పింది. ఇక చివర్లో కాజల్ డబ్బులు లెక్కించే టాస్క్‌లో పాల్గొనగా, ఆ సమయంలో సుధీర్ తన మాటలతో కాజల్‌ని డిస్ట్రబ్ చేస్తాడు. దాంతో సుధీర్‌పై చిర్రుబుర్రులాడింది కాజల్. గేమ్ గెలవాలనే కసిలో సుధీర్ ని అలా చిన్న వార్నింగ్ ఇచ్చిందంటూ