Kalki| పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చివరిగా సలార్ చిత్రంతో అతి పెద్ద హిట్ కొట్టాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే చిత్రం చేస్తున్నారు. మహాభారతంతో ముడిపడిన సైన్స్ ఫిక్షన్ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని తో పాటు మరికొంతమంది స్టార్ కాస్ట్ కూడా ఇందులో నటిస్తున్నారు.ఈ చిత్రంతో ప్రభాస్ సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమాని జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుండగా, గత కొద్ది రోజులుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు.
ఇప్పటికే కల్కి సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలు అభిమానులని ఎంతగానో అలరించాయి. ఇక ఇప్పుడు కల్కి చిత్ర యూనిట్ ఓ ఆసక్తికరమైన వీడియో రిలీజ్ చేసింది. అది చూస్తుంటే మూవీ మాత్రం చాలా టెక్నికల్‌గా, అడ్వాన్స్‌డ్‌గా కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇందులో బుజ్జి అనే హైలీ అండ్ స్మార్ట్ పవర్ ఫుల్ వెహికిల్ ఒకటి భాగం కానుంది. దీనిని ప్రభాస్ ఉపయోగించనున్నాడు. అయితే బుజ్జి మాట్లాడే మాటలు చాలా క్యూట్‌గా ఉంటాయి. అయితే బుజ్జి వాయిస్ కీర్తి సురేష్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే వెహికల్ ని తయారు చేసే వీడియోని చిత్రయూనిట్ రిలీజ్ చేయగా, దాని కోసం చిత్ర యూనిట్ ఎంత కష్టపడింది అనేది ఇందులో చూపించరు.
నాకు బ్రెయిన్ ఉంది కానీ బాడీ లేదు అని బుజ్జి బాధపడుతూ ఉంటుంది. నా బాడీని త్వరగా తయారు చేయండి రా అంటూ చిత్ర యూనిట్ ని తొదరపెట్టడం భలే క్యూట్‌గా అనిపిస్తుంది. ‘సచ్చినోడా’ అంటూ బుజ్జి తిట్లు కూడా తిడుతోంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. బుజ్జి పూర్తి రూపాన్ని మే22న చూపిస్తామని మేకర్స్ తాజాగా విడుదలైన వీడియోలో చూపించారు. ఇక ఈ సినిమా ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఉంటుందట. నాగ్ అశ్విన్ సినిమాని చాలా అద్భుతంగా తీసాడని,బాహుబలిని మించి ఉంటుందని అంటున్నారు.
Presenting ‘𝐅𝐫𝐨𝐦 𝐒𝐤𝐫𝐚𝐭𝐜𝐡 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒: Builiding a Superstar #Bujji‘ from #Kalki2898AD!!!https://t.co/PwgcOBfJcf @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji… pic.twitter.com/tfmW7EtYiF
— Kalki 2898 AD (@Kalki2898AD) May 18, 2024