నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న కొత్త చిత్రం #NKR21. ఈ రోజు కళ్యాణ్ రామ్ జన్మదినం సందర్భంగా మేకర్స్ సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదల చేసి ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న కొత్త చిత్రం #NKR21. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బులుసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది.
ఆ పోస్టర్‌లో చుట్టూ మనుషులు అగ్నికి అహుతై ఉండగా చేతిలో నిప్పుతో కల్యాణ్ రామ్ ఉన్న లుక్‌ను విడుదల చేసి ‘if you can’t be a good example be a terrible warning ( మీరు ఆదర్శంగా ఉండలేకపోతే భయపెట్టే వాడిలా ఉండండి’ అంటూ డైలాగ్స్ ట్యాగ్ చేశారు.
ఈ చిత్రంలో సాయి మంజ్రేక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఓ కీలక పాత్ర పోషిస్తుంది. వీరితో పాటు బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎడాది చివరలో సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.