Sunday, December 29, 2024
HomeNationalRailway Compensation | రైలులో నుంచి కింద‌ప‌డి మ‌ర‌ణిస్తే భార‌తీయ రైల్వే ప‌రిహారం చెల్లించాల్సిందేనా?

Railway Compensation | రైలులో నుంచి కింద‌ప‌డి మ‌ర‌ణిస్తే భార‌తీయ రైల్వే ప‌రిహారం చెల్లించాల్సిందేనా?

న్యూఢిల్లీ: రైలు దిగుతూ ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించిన ప్ర‌యాణికుల‌కు ప‌రిహారం (Railway Compensation) చెల్లించాల్సిన బాధ్య‌త రైల్వే శాఖ‌దేన‌ని క‌ర్ణాట‌క హైకోర్టు స్ప‌ష్టం చేసింది. బాధితుల‌కు ప‌రిహారం నిరాకరించ‌డాన్ని త‌ప్పుప‌ట్టింది. రైలు దిగుతూ చ‌నిపోయిన ఓ ప్ర‌యాణికురాలి కుటుంబానికి వ‌డ్డీతో స‌హా కాంప‌న్షేష‌న్ చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. భారతీయ రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 124-ఏ ప్రకారం ట్రైన్ నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు మరణించిన బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రైల్వే శాఖదేనని పేర్కొంది. ఈ కేసులో రైల్వే క్లైయిమ్స్ ట్రిబ్యునల్ (RCT) ఇచ్చిన తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది.

2014లో జయమ్మ అనే మహిళ తన సోదరి రత్నమ్మతో కలిసి చెన్నపట్టణ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. మైసూరులోని అశోకపురం వెళ్లేందుకు తిరుపతి ప్యాసింజర్ రైలు కోసం వేచిఉన్నారు. అయితే తిరుప‌తి రైలు అనుకుని పొరపాటున తన సోదరితో కలిసి ట్యూటికోరిన్ ఎక్స్​ప్రెస్ ఎక్కారు. కొద్దిసేప‌టి త‌ర్వాత తాము వేరే రైలు ఎక్కానని గుర్తించిన జయమ్మ కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించారు. ఈక్ర‌మంలో ప్రమాదవశాత్తు కింద పడి చ‌నిపోయారు. దీంతో తమకు పరిహారం ఇవ్వాలని ఆమె కుటుంబ సభ్యులు రైల్వే ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు. దానికి రైల్వే ట్రైబ్యునల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. దానిని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

కాగా, మృతురాలు పొరపాటున వేరే రైలు ఎక్కార‌ని, దిగాలనుకున్నప్పుడు అలారం చైన్ లాగి ఉండాల్సిందని రైల్వే శాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అందుకే రైల్వే చట్టంలోని సెక్షన్ 123(ఈ) కింద పరిహారం అందించేదిలేద‌ని పేర్కొన్నారు. దీనికి హైకోర్టు ఏక‌స‌భ్య‌ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తంచేస్తూ మృతురాలికి పరిహారం ఇవ్వాల్సిందేని స్ప‌ష్టం చేసింది. ఆమె కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.4 లక్షలకు 7 శాతం వడ్డీతో ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.

 

 

RELATED ARTICLES

తాజా వార్తలు