Katrina Kaif| ఈ మధ్య కాలంలో చాలా మంది సీనియర్ భామలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కారు. ఆ తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. పిల్లలు పుట్టిన తర్వాత కూడా వారు ప్రొఫెషనల్ లైఫ్ కొనసాగిస్తూనే పర్సనల్ లైఫ్‌ని డిస్ట్రబ్ కాకుండా చూసుకుంటున్నారు. అయితే వారి పెళ్లి, ప్రగ్నెన్సీ విషయాలని చాలా సీక్రెట్‌గా ఉంచుతుండడంతో అభిమానులలో ఎక్కడ లేని ఆసక్తి నెలకొంటుంది. త్వరలోనే తల్లి కాబోతున్న దీపికా పదుకొనే ఈ విషయాన్ని చెప్పడానికి చాలా రోజుల సమయం తీసుకుంది. ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట కూడా బిడ్డ పుట్టే దాకా ఆ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచారు. ఇక ఇప్పుడు కత్రినా కైఫ్ ప్రగ్నెన్సీకి సంబంధించి అనేక రూమర్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
యంగ్ హీరో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగి తేలి ఆ తర్వత 2021 డిసెంబర్లో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ఇక పెళ్లైనప్పటి నుండి కూడా వీరు గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల కత్రినా ఎప్పుడు బయట కనిపించిన కూడా లూజ్ డ్రెస్సులు వేసుకొని కనిపిస్తుంది. కొన్ని పార్టీలకి డుమ్మా కొడుతుంది. ఎక్కడ బేబి బంప్ కనిపిస్తుందేమోనని ఆమె పార్టీలకి రావడం లేదంటూ ప్రచారం కూడా నడుస్తుంది. ఇటీవల కత్రినా లండన్‌కి వెళ్లగా, ఆమె ప్రెగ్నెన్సీ కోసమే వెళ్లిందని ప్రచారాలు చేశారు. అయితే వీటిపై కత్రినా టీం తాజాగా స్పందించినట్టు తెలుస్తుంది.
కత్రినా కైఫ్ ప్రెగ్నెసీ రూమర్లను ఆమె టీమ్ కొట్టిపారేస్తూ ఆమె ప్రగ్నెంట్ కాదని క్లారిటీ ఇచ్చారు. లండన్‌కి పర్సనల్ పనిపైన వెళ్లింది తప్ప, ప్రగ్నెన్సీ కోసం కాదంటూ కూడా వారు తెలియజేశారు. ఇక కత్రినా ఈ మధ్య పెద్దగా సినిమాలు చేస్తున్నట్టు లేదు. చివరగా మేరీ క్రిస్మస్ చిత్రంలో కనిపించారు. ఈ మూవీలో హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించాడు. జనవరి 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేక చతికిల పడింది. మేరీ క్రిస్మస్ తర్వాత కత్రీనా ఏ మూవీకి ఓకే చెప్పలేదు, కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేందుకు కొంత టైం తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది.