Kavya maran| ఐపీఎల్‌లో చీర్‌గార్ల్స్ కన్నా కూడా టీమ్ ఓనర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌కి సీఈఓగా ఉన్న కావ్య మారన్.. సన్ రైజర్స్ టీమ్ ఆడుతున్నప్పుడు కావ్య చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ ముద్దుగుమ్మ తన యాక్షన్‌తో స్టేడియంలోని ప్రేక్షకుల నుంచే కాదు…టీవీల్లో మ్యాచ్ చూసే ఫ్యాన్స్ నుంచి కూడా అప్లాజ్ అందుకుంటుంది.కావ్య అంటే ఆషామాషీ కాదు ఈమె ఇచ్చే సపోర్ట్‌తోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్‌కి చేరుకుంది.. ఐపీఎల్‌తో కావ్యా మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని తన జట్టుని చీర్ చేస్తుంటుంది.
కావ్య తమిళ ప్రముఖ మీడియా టైకున్ కలానిది మారన్ కుమార్తె కావడం విశేషం. కావ్య మారన్ వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. కావ్య వయసు 32 ఏళ్లు కాగా ప్రస్తుతం సింగిల్ గానే ఉంటుంది. చాలా ఏళ్లుగా కావ్య మారన్ చుట్టూ ఎన్నో డేటింగ్ రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉన్నా, దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే కావ్య కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ తో డేటింగ్‌లో ఉందనే ప్రచారం జరిగింది. వారిద్దరు ఎక్కువగా మీడియాకి కనిపించడం తో కావ్య మరియు అనిరుధ్ ప్రేమలో ఉన్నారుని అందరు ముచ్చటించుకున్నారు. ఆ సమయంలోనే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు.
ఇక ఐపీఎల్ 2023 లో రిషబ్ పంత్ తో ఎక్కువగా కనిపించిన కావ్య తమ మధ్య ఏదో ఉంది అనే సిగ్నల్ ఇచ్చింది. అయితే అప్పటికే రిషబ్ మరొక నటితో రిలేషన్ మెయింటైన్ చేయడం వలన ఆ డేటింగ్స్ రూమర్స్ కేవలం రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2024లో హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అభిషేక్ శర్మ చాలా ఏళ్ల నుంచి సన్‌రైజర్స్ టీం తరుఫున ఆడుతున్నాడు. స్టార్ ప్లేయర్లను సైతం జట్టు నుంచి తొలగించిన కావ్య మారన్ అభిషేక్ శర్మను మాత్రం తన టీమ్‌లోనే ఉంచుకుంటుంది. ఈ ఇద్దరి మధ్య ఏడో నడుస్తుందని, అందుకే అభిషేక్ శర్మని వదలడం లేదని టాక్ అయితే ఉంది. మరి వీరి బంధం ప్రొఫెషనల్‌గానా లేదా ఏదైనా రిలేషన్‌షిప్‌గా మారుతుందా అనేది చూడాల్సి ఉంది.