కరీంనగర్: కరీంనగర్‌లోని రాజా మెస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు హిమాన్షు (Himanshu) సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గురువారం కరీంనగర్ వచ్చారు. ఆయనతోపాటు హిమాన్షు కూడా కేసీఆర్ వెంటే బస్సులో అక్కడికి వచ్చారు. కేసీఆర్ ఉత్తర తెలంగాణ భవన్‌లో బస చేయగా, మనవడు లోకల్ ఫుడ్ కోసం పట్టణంలోని రాజా మెస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా హిమాన్షు తన దోనస్తులతో కలిసి మటన్, కడక్‌నాథ్ కోడితో భోజనం చేసి ఆకలి తీర్చుకున్నారు.
గతేడాది గచ్చిబౌలీలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తిచేసిన హిమాన్షు.. కేసీఆర్ సమక్షంలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు.