హైదరాబాద్: కేసీఆర్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ.. కేసీఆర్‌కు తెలంగాణకు ఉన్న బంధం అది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. దిక్కు దివానా లేనప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్‌ను ఫణంగా పెట్టానని చెప్పారు. తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నా గుండెల్లో తెలంగాణ ఉంటది.. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటడు. గెలుపోటములు పక్కన పెడితే కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. వంద శాతం కేసీఆర్‌కు ఆ బాండేజ్ ఉంటది. కేసీఆర్‌ను గిల్లి పడేస్తాం అనుకుంటే వాడు పిచ్చోడు అయితడు తప్ప తెలంగాణ ప్రజలు కారు అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
అంతకంటే దురదృష్టం..
హైదరాబాద్ రెండో రాజధాని అయితే బాగుంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే లాంటి వ్యక్తి మాట్లాడం అంటే.. అంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. ఇన్ని రోజులు ఢిల్లీకి పోయిన ఆయన.. నాకు హైదరాబాద్ దగ్గరైతదని చెప్పి హైదరాబాద్ గొంతు కోస్తమంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ రెండో రాజధాని కావాలని అంటుండంటే వీళ్లు ఎవరు వచ్చినా హైదరాబాద్‌ను దెబ్బ కొడుతారు అని అర్థమైతుంది. హైదరాబాద్ మనది మన సొంతం. దాన్ని అట్ల పోనివ్వం. అటువంటి పిచ్చివాళ్లకు ఇక్కడ స్థానం ఇవ్వకూడదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.
జాతీయ రాజకీయాల్లోకి రావాలని..
జాతీయ రాజకీయాల్లోకి రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చాం.. ఆ ప్రయత్నం చేశాం. మహారాష్ట్రలో కార్యక్రమాలు చేపట్టాం. అక్కడ్నుంచి వచ్చిన కొంత మంది నాయకులు.. అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మీ పేరు చెప్పుకుని మేం గెలుస్తాం. మా దగ్గర మార్పు రావాలి. మీ ప్రభుత్వంలో అమలైన పథకాలు రావాలని ప్రజలు కోరుతున్నారు. మిమ్మల్ని తీసుకురావాలని కోరుతున్నారు. మా దగ్గర భయంకరమైన అనిశ్చితి ఉందన్నారు. నా జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను. అనుమానం లేదు. ఎన్నికల తర్వాత అందరితో చర్చించి ప్రాంతీయ శక్తుల ఐక్యతకు కృషి చేస్తాను. నా తెలివితేటలను రంగరించి అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే చాలా మందితో మాట్లాడుతున్నాను. అందరం కలిసి ప్రత్యామ్నాయం రూపొందింస్తాం అని కేసీఆర్ తెలిపారు.
స్వలాభం కోసం పోతున్నారు..
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఈ సన్ ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువగా తయారైంది. పొద్దు తిరిగినట్టు తిరుగుతారు. ఇవన్నీ పవర్ ఫ్లవర్స్.. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కాదు వాళ్ల స్వార్థం కోసం వాళ్ల పైరవీల కోసం వాళ్ల స్వలాభం కోసం పోతున్నారు. అందరు పోలేదు. బీఆర్ఎస్ ఒక మహాసముద్రం 60 లక్షల సభ్యత్వం ఉంది. బీఆర్ఎస్‌ను ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం. లక్షల రేవంత్ రెడ్డిలు వచ్చినా వెంట్రక మందం ఫరాక్ పడదు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ లైవ్ Only on Telugu scribe https://t.co/x9GHgnAEUV
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2024