హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రళయ గర్జన చూస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటానని చెప్పారు. అవకాశం వస్తే ఎవరైనా ఉండరా..? నేను అంత అమాయకుడినా..? అవకాశం రావాల్నే కానీ.. తప్పకుండా రేసులో ఉంటానని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేశ్ రెడ్డి కాబోతున్నారని, చైర్మన్‌కు రేపు లెటర్ ఇష్యూ చేస్తున్నామని తెలిపారు. సురేశ్ ఈజ్ మెయిన్ ప్లేయర్ ఇన్ ఢిల్లీ అని కేసీఆర్ పేర్కొన్నారు.
లక్ష మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా..
ఒక రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీ దొడ్లే ఎంత మంది ఉంటారో చూడు అని అన్నారు. ఏం కాలేదు. ఇది కూడా అంతే ఉంది. బీఆర్ఎస్ ఒక మహా సముద్రం. పార్టీకి 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. లక్ష మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి వెంట్రుక మందం కూడా ఫరక్ పడదు.ఆయనే బీజేపీలోకి జంప్ కొడుతారని కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో ఆయన తప్పించుకోలేరు. కాబట్టి కిందమీద అయితే కేసులు తప్పించుకునేందుకు బీజేపీలోకి వెళ్తాడని అనుకుంటున్నారు. మా పార్టీలోకే కాంగ్రెసోళ్లు రాబోతున్నారు. నన్ను ఎవరూ డైరెక్ట్ అడగలేదు. మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యులు అడుగుతున్నారని చెప్పారు. 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉరు, ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు వెల్లడించారు. ఏం జరగబోతదో చూద్దామని చెప్పారు.
బీఆర్ఎస్ బీఆర్ఎస్‌గానే..
బీఆర్ఎస్ బీఆర్ఎస్‌గానే ఉంటుందని స్పష్టం చేశారు. పెద్దపల్లితో పాటు మిగతా ఎస్సీ నియోజకవర్గాల్లో మాదిగ సామాజికవర్గం ఆగ్రహంగా ఉన్నది. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి చూపెడుతామని స్పష్టం చేశారు. ఆ ఆగ్రహానికి కాంగ్రెస్ బలి అవుతుందని చెప్పారు. జిల్లాలు తీసేస్తామంటే యుద్ధానికి సిద్ధమని ప్రజలు అంటున్నారని, అది కూడా కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందని కేసీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ ఒక మహా సముద్రం.. బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి.
లక్ష మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి వెంట్రుక మందం కూడా ఫరక్ పడదు – కేసీఆర్ pic.twitter.com/RruB2QDHZs
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2024