సిరిసిల్ల: దేశంలో తొలిసారి చేనేత మీద జీఎస్టీ వేసిన మొదటి ప్రధాని మోదీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. ఏ ప్రధాని కూడా చేనేతపై జీఎస్టీ విధించలేదు, కానీ మోదీ విధించారని విమర్శించారు. చేనేతలకు ఉన్న ఇన్సూరెన్స్‌తో పాటు అన్ని స్కీమ్స్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులంటే వారికి లెక్కే లేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ఎజెండాలో పేదలు, కార్మికులు, రైతులు, ఆటో రిక్షా కార్మికులు ఉండనే ఉండరన్నారు. పెద్ద పెద్ద గద్దల ఎజెండా ఉంటదని విమర్శించారు. అదానీ, అంబానీ లాంటి లక్షల కోట్ల శ్రీమంతులకు కార్పొరేట్ ట్యాక్స్‌లు రద్దు చేస్తరు తప్ప పేదవాళ్లకు మంచి చేయలేదన్నారు.
15 లక్షలు కాదు రూ.15 కూడా రాలే..
2014లో తాను ప్రధానిగా గెలిచిన తర్వాత రూ.15 లక్షలు ఇస్తానని చెప్పారు.. కానీ రూ.15 లక్షలు కాదుకదా పదిహేను రూపాయాలు కూడా రాలేదని విమర్శించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ రాలేదు. అచ్చేదిన్ రాలేదు. బేటీ పడావో బేటి బచావో వచ్చిందా..? జన్ ధన్ ఖాతా ఏమైనా జరిగిందా..? డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్టే కానీ ఏం జరగలేదు. ఎవరికి కూడా న్యాయం జరగలేదు. గొల్లకుర్మలకు గొర్రెలు ఇస్తుంటే అడ్డు పడ్డరు. మోదీ గెలిస్తే పెట్రోల్, డిజీల్ ధర రూ.400 దాటుతది. మోసపోతే గోసపడుతాం.. జాగ్రత్త అని మనవి చేస్తున్నాని తెలిపారు.
“రాజన్న సిరిసిల్ల జిల్లా.. దేవుని పేరు కూడా ఉండాలని వేములవాడ రాజన్న పేరును సిరిసిల్ల జిల్లాకు పెట్టుకున్నాం. లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్టీలు రంగంలో ఉన్నాయి. ఏ పార్టీలు ఏం చేశాయో మీకు అందరికీ బాగా తెలుసు. నిన్న ఈ వేములవాడకు ప్రధాని మోదీ వచ్చారు. ఆయన పక్కనే బండి సంజయ్ ఉన్నాడు. దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే ప్రధాని మోదీ, హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పారా..? అది కూడా లేదు. ఇరుకుగా ప్లేస్ ఉందని చెప్పి నేను అక్కడొచ్చి 35 ఎకరాలు ఇప్పించి అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాను. బండి సంజయ్ రూపాయి అడగలేదు.. మోదీ ఇవ్వలేదు.
కోపం వచ్చి ఒక మాట అన్నా..
ఇది చేనేతలు ఎక్కువగా నివసించే ప్రాంతమని, గతంలో చేనేతల ఆత్మహత్యలు జరిగితే కన్నీళ్లు పెట్టుకున్నా.. బాధపడ్డానని చెప్పారు. అనేక పథకాలు తెచ్చి బతుకమ్మ చీరలు, స్కూల్ డ్రస్సులు, క్రిస్మస్, రంజాన్ కానుకలు ఆర్డర్లుగా ఇచ్చి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించామన్నారు. రూ.372 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవ్వమని అడిగితే నిరోధ్‌లు, పాపడలు అమ్ముకోండని కాంగ్రెస్ నేతలు అంటే కోపం వచ్చి ఒక మాట అన్నాను. దాంతో నా మీద 48 గంటల నిషేధం పెట్టారు. చేనేత, పద్మశాలిలను అవమానించారని మాట్లాడితే నిషేధం పెట్టారని” వెల్లడించారు.
నిన్న వేములవాడకు ప్రధాని మోదీ వచ్చిండు.. పక్కనే బండి సంజయ్ ఉన్నడు.
వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పారా..?బండి సంజయ్ రూపాయి అడగలేదు.. మోదీ ఇస్తానని చెప్పలేదు!
– సిరిసిల్ల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 🔥@KCRBRSPresident @KTRBRS @vinodboianpalli… pic.twitter.com/bunpxsorLJ
— BRS Party (@BRSparty) May 10, 2024
కారు గుర్తుకే మా ఓటు అంటూ సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం. #VoteForCar #LokSabhaElections2024 #KCRPoruBaata pic.twitter.com/uIOPFa5iXI
— BRS Party (@BRSparty) May 10, 2024